Land Value భూముల విలువ పెంపు
ABN , Publish Date - Jan 23 , 2026 | 11:49 PM
Land Value Enhancement ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 1 నుంచి జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువ పెరగనుంది. ఇందుకు సంబంధించి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ నెలాఖరు వరకే పాతరేట్లు అమలులో ఉండనున్నాయి. ఆ తర్వాత జిల్లాలో భూముల ధరలు పెరగనున్నాయి.
పాలకొండ, జనవరి 23(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 1 నుంచి జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువ పెరగనుంది. ఇందుకు సంబంధించి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ నెలాఖరు వరకే పాతరేట్లు అమలులో ఉండనున్నాయి. ఆ తర్వాత జిల్లాలో భూముల ధరలు పెరగనున్నాయి. ఇప్పటికే జిల్లాలోని నాలుగు సబ్‌రిజిస్ర్టార్ కార్యాలయ పరిధిలోని అధికారులు బహిరంగ మార్కెట్ ధరను సరిపోల్చి భూములు మార్కెట్ విలువ పెంచేందుకు కసరత్తు చేస్తున్నారు.
పాలకొండ, పార్వతీపురం, కురుపాం, సాలూరు సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాల ద్వారా రిజి స్ట్రషన్ ప్రక్రియ కొనసాగుతుంది. జిల్లాలో 15 మండలాలు ఉండగా, పట్టణ పరిధిలోకి వచ్చే భూములతో పాటు శ్రీకాకుళం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సుడా), బొబ్బిలి డెవలప్‌మెంట్ అథారిటీ (బుడా)భూముల మార్కెట్ విలువ పెరిగే అవకాశం ఉంది. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న సీతంపేట, భామిని, కురుపాం, గుమ్మలక్ష్మీపురం మండలాల్లో భూముల ధరలు యథావిధంగా ఉంటాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూముల మార్కెట్ విలువను పెంచడం ఇది రెండోసారి. తాజా నిర్ణయంతో జిల్లాలో 10 నుంచి 20 శాతం వరకు భూముల మార్కెట్ విలువ పెరిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఎకరా ఆరు లక్షలున్న భూమి ధరను పది శాతం పెంచితే వచ్చేనెల నుంచి రూ. ఆరు లక్షల 60 వేలకు, 20 శాతం పెంచితే రూ.7 లక్షల 20 వేలు పెరిగే అవకాశం ఉంది.
జిల్లాలోని సబ్ రిజిస్ర్టార్లు నిర్ణయించిన ధరలను జాయింట్ కలెక్టర్ పరిశీలించి ఆమోద ము ద్ర వేయాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 1 నుంచే ఈ నిబంధన అమలయ్యేలా రిజిస్ర్టేషన్‌శాఖ చర్యలు చేపడుతుంది. గడిచిన రెండేళ్లలో మన్యం జిల్లాకు ఇచ్చిన లక్ష్యాలను రిజిస్ర్టేషన్‌శాఖ అధిగ మిస్తోంది. తాజాగా భూముల విలువ పెంపుతో వచ్చేనెల నుంచి ప్రభుత్వానికి మరింతగా ఆదాయం సమకూరనుంది. జిల్లాలో 2024-25లో 18,202 రిజిస్ర్టేషన్లు జరిగాయి. రూ.38.23 కోట్లు లక్ష్యానికి గాను రూ. 39 కోట్ల వరకు ఆదాయం సమకూరింది. 104 శాతం రెవెన్యూ వచ్చినట్టు అధికారుల లెక్కల ద్వారా తెలుస్తోంది. 2025-26లో జిల్లా వ్యాప్తంగా రూ. 38.15 కోట్లు లక్ష్యం కాగా రూ.31 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది. ఇప్పటివరకు 13,558 డ్యాకుమెంట్స్ రిజిస్ర్టేషన్ అవ్వగా.. 84 శాతం మేర లక్ష్యంగా చేరినట్టయింది.
కమిటీ ఆలోచన మేరకు పెంపు
‘పట్టణ ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువ పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా దీనిపై కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరించే కీలక కమిటీలో చర్చిస్తారు. ఇందులో జాయింట్ కలెక్టర్, సబ్‌రిజిస్ర్టార్లు బుడా, సుడా, మున్సిపాలిటీ , నగర పంచాయతీల సభ్యులు ఉంటారు. వీరందరి ఆలోచన మేరకు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఫిబ్రవరి 1 నుంచి జిల్లాలో భూముల మార్కెట్ విలువ పెంచే అవకాశం ఉంది. దీనిపై ప్రజాభిప్రాయ సేకరణ, అభ్యంతరాలను పరిశీలిస్తాం.’ అని జిల్లా రిజిస్ర్టార్ నాగలక్ష్మి తెలిపారు.