భూ హక్కు పత్రాలు మంజూరు చేయాలి
ABN , Publish Date - Jun 16 , 2026 | 12:08 AM
ఏళ్ల తరబడి సాగు చేస్తున్న సాగు భూముల కు భూహక్కు పత్రాలు మంజూరు చేయాలని కోరుతూ మండలంలోని కొండగం గుబూడి గ్రామ గిరిజన రైతులు సోమవారం పోరుబాట పట్టారు.
కొండగంగుబూడి రైతుల నిరసన
వేపాడ, జూన్ 15(ఆంధ్రజ్యోతి): ఏళ్ల తరబడి సాగు చేస్తున్న సాగు భూముల కు భూహక్కు పత్రాలు మంజూరు చేయాలని కోరుతూ మండలంలోని కొండగం గుబూడి గ్రామ గిరిజన రైతులు సోమవారం పోరుబాట పట్టారు. సీపీఎం, ఏపీ రైతు సంఘం సారథ్యంలో చలో తహసీల్దార్ కార్యాలయం పేరుతో 200 మంది మహిళా రైతులు వేపాడ చేరుకుని రాస్తారోకో చేపట్టారు. సాగు భూములకు పట్టాలు మంజూరు చేయాలని తహసీల్దార్ కార్యాలయం వద్ద నినాదాలు చేశారు. సీపీఎం నాయకుడు చల్లా జగన్ ఆధ్వర్యంలో వారంతా తహసీల్దార్ కార్యాలయం లోకి వెళ్లారు. అక్కడ ఉన్న డీటీ రామకృష్ణ.. కలెక్టర్ గ్రీవెన్స్‌లో ఉన్న తహసీల్దార్ కు ఫోన్‌లో విషయాన్ని వివరించారు. దీనిపై తహసీల్దార్ రాములమ్మ ఫోన్‌లో మాట్లాడుతూ సమస్యను ఆర్డీవో దృష్టికి తీసుకువెళ్లానని, ముందుగా గ్రామానికి సర్వేయర్, వీఆర్వోలను పంపించి.. సాగు భూములను సర్వే చేయిస్తామని చెప్పా రు. రికార్డు సిద్ధం చేశాక.. జిల్లా అధికారులు, ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టాలు మంజూరు చేస్తామన్నారు. దీంతో గిరిజన రైతులు ఆందోళన విరమించారు.