భూసర్వే వేగవంతం చేయాలి: ఆర్డీవో
ABN , Publish Date - Nov 18 , 2026 | 11:49 PM
భూసర్వే వేగవంతం చేయాలని చీపురుపల్లి ఆర్డీవో ఎం.సుధారాణి కోరారు. బుధవారం రేగిడితహసీల్దార్ కార్యాలయంలో సమగ్ర భూసర్వేపై వీఆర్వోలు, వీఎస్‌లతో సమీక్షించారు.
రేగిడి, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): భూసర్వే వేగవంతం చేయాలని చీపురుపల్లి ఆర్డీవో ఎం.సుధారాణి కోరారు. బుధవారం రేగిడితహసీల్దార్ కార్యాలయంలో సమగ్ర భూసర్వేపై వీఆర్వోలు, వీఎస్‌లతో సమీక్షించారు. మండలంలో ఆరోఫేజ్‌లో 12 రెవె న్యూ గ్రామాల్లో జరుగుతున్న సర్వే పోగ్రాస్‌ను రెవెన్యూ గ్రామాల వారిగా సమీక్షిం చారు. ప్రస్తుతం జరుగుతున్న గ్రౌండ్ ట్రూతింగ్ వేగవంతంగా పూర్తిచేయాలని, ఈనెలాఖరులో కనీసం ఆరుగ్రామాలకు తక్కువకాకుండా వీఎస్‌లాగిన్ ప్రారంభించా లని తహసీల్దార్ ఈశ్వరరావు, సిబ్బందిని ఆదేశించారు. అనంతరం బొడ్డవలస ఇసుక ర్యాంప్ స్టాక్‌యార్డు పరిశీలించారు. అమె వెంట తహసీల్దార్, ఆర్‌ఐ గిరి ఉన్నారు.
సర్వేలో సమస్యలు పరిష్కరించండి
సంతకవిటి, నవంబరు 18ఆంధ్రజ్యోతి): క్షేత్రస్థాయిలో సర్వే సందర్భంగా ఎదురవు తున్న సమస్యలను గుర్తించి పరిష్కరించాలని చీపురుపల్లి ఆర్డీవో సుధారాణి సూచించారు. బుధవారం మండలంలోని బొద్దూరులో భూముల రీ-సర్వే ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా సర్వే నిర్వహిస్తున్న తీరును, భూముల వివరాల నమోదు, రికార్డుల నిర్వహణ విధానాన్ని సంబంధిత రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంతకవిటి తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించి రీ-సర్వే పురోగతిపై సమీక్షించారు.