వైసీపీ పాలనలో భూహక్కులు హరించారు
ABN , Publish Date - Mar 10 , 2026 | 11:51 PM
గత వైసీపీ ప్ర భుత్వం రీసర్వే నెపంతో రైతుల భూహక్కులు హరిం చిందని రాష్ట్ర సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల, సెర్ఫ్, ఎన్నారై సాధికారత సంబంధాల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.
మంత్రి శ్రీనివాస్
బొండపల్లి, మార్చి 10(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్ర భుత్వం రీసర్వే నెపంతో రైతుల భూహక్కులు హరిం చిందని రాష్ట్ర సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల, సెర్ఫ్, ఎన్నారై సాధికారత సంబంధాల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం కొండకిండాం గ్రామం లో నిర్వహించిన మీ భూమి-మీ హక్కు గ్రామసభలో ఆయన పాల్గొని, రైతులకు ప్రభుత్వ రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డిసెంబరు 2027 నాటికి ప్రతి రైతుకు క్యూఆర్ కోడ్‌తో ఫోన్‌లోనే భూ వివరాలు చూ సుకునేలా ఆధునిక పద్ధతి వస్తుందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం రీసర్వే నెపంతో రైతుల భూహక్కులు హరించేందుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్టుతో వివాదాలు ఉన్న భూములపై పెత్తనం చేయడానికి పన్నాగం పన్నిందన్నారు. అనంతరం గ్రామంలో 118 మంది రైతులకు డిజిటల్ పట్టాదారు పాసుపుస్తకాలు అందజే శారు. జనసేన పార్టీ గజపతినగరం నియోజక వర్గ ఇన్‌చార్జి మర్రాపు సురేష్ మాట్లాడుతూ బడుగు, బలహీనులకు అండగా పార్టీ నిలుస్తుందని అన్నారు.
సమస్యలపై వినతి
ఈసందర్భంగా మాజీ సర్పంచ్ ముంజేటి పార్వతి.. మంత్రికి పలు అభివృద్ధి పనులపై వినతిపత్రం అందజే శారు. ఆండ్ర జలాశయం నుంచి సాగునీరు అందించేలా కృషి చేయాలని కోరారు. గ్రామంలో నెలకొ ల్పనున్న ఎంఎస్‌ఎంఈ పార్కు ద్వారా నిరుద్యోగ యు వతకు స్వయం ఉపాధి సాధించుకునే అవకాశం కల్పిం చాలని కోరారు. దీంతో స్పందించిన మంత్రి.. గ్రామంలో తొలి విడతగా 57 ఎకరాలు, మలి విడతగా వందల ఎకరాల స్థలాన్ని గుర్తించి ఏపీఐఐసీ ద్వారా పారి శ్రామిక అభివృద్ధి జరిపేందుకు ప్రణాళికాబద్ధంగా పని చేస్తున్నామని తెలిపారు. దీంతో సుమారు 5వేల మంది కి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ అధ్యక్షుడు పీవీవీ గోపాలరాజు, టీడీపీ మండల అధ్యక్షుడు రాపాక అచ్చుంనాయుడు తోపాటు రయింద్రాం, కెరటాం, సిటి.పల్లి, బి.రాజేరు సర్పంచ్‌లతో పాటు తహసీల్దార్ డోలా రాజేశ్వరరావు, ఎంపీడీవో గిరిబాల పాల్గొన్నారు.