ల్యాండ్ టైటిల్ పేరుతో భూ సమస్యలు
ABN , Publish Date - Feb 07 , 2026 | 12:23 AM
గత వైసీ పీ ప్రభుత్వం ఏ ఒక్కరైతు కోరకుండానే ల్యాండ్ టైటిల్ యాక్టు తీసుకువచ్చి రైతులకు భూ సమస్యలను తెచ్చిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విమర్శించారు.
మంత్రి శ్రీనివాస్
పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ
గజపతినగరం, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): గత వైసీ పీ ప్రభుత్వం ఏ ఒక్కరైతు కోరకుండానే ల్యాండ్ టైటిల్ యాక్టు తీసుకువచ్చి రైతులకు భూ సమస్యలను తెచ్చిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విమర్శించారు. శుక్రవారం ఆయన పిడిశీల గ్రామంలో పట్టాదారు పాసు పుస్తకాలను అందజేశారు. ఈసందర్భంగా ఆయ న మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జగన్ రీసర్వే పేరు తో కొత్త సమస్యలను తీసుకువచ్చారన్నారు. పాసు పుస్తకాలపై ఆయన బొమ్మ ఎందుకని ప్రశ్నించారు. పది లక్ష కోట్ల అప్పుతో రాష్ట్రాన్ని అప్పగించడంతో పాటు లక్ష కోట్లు పెండింగ్‌లో పెడితే కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని తీర్చింద న్నారు. ఉద్యోగులకు 30 వేల కోట్లు జీతాలు బకాయిలు పెడితే 20నెలల్లో 12 వేల కోట్లు వేతనాలు చెల్లింపులు చేపట్టామన్నారు. వరి పంటలకు అధికంగా వాడే యూరియా వల్ల క్యాన్సర్ బారిన పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో క్యాన్సర్ వ్యాధి బారిన పడిన వారి లో కాకినాడ ప్రథమ స్థానంలో ఉండగా విజయనగరం జిల్లా రెండో స్థానంలో ఉందన్నారు. సమ స్యలు లేకుండా పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీలో జిల్లాలో గజపతినగరం మండలం ప్రథమ స్థానంలో ఉందన్నారు. అనంతరం గ్రామంలో 191 పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు అందజేశారు. అలాగే పాతబగ్గాం గ్రామానికి చెందిన సూర్యకాంతంకు రూ.69వేల500 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్‌ను అందజేశా రు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి ఆర్డీవో ఎం.రామ్మోహన రావు, తహసీల్దార్ బి.రత్నకుమార్, పార్టీ జిల్లా ఉపాధ్య క్షుడు మక్కువ శ్రీధర్, ఏఎంసీ చైర్మన్ పీవీవీ గోపాల రాజు, పార్టీ మండల అధ్యక్షుడు గంట్యాడ శ్రీదేవి, మం డల ప్రధాన కార్యదర్శి లెంక చిన్నంనాయుడు తదితరు లు పాల్గొన్నారు.