Share News

భూసేకరణ పనులు సకాలంలో పూర్తి చేయాలి

ABN , Publish Date - Mar 24 , 2026 | 11:56 PM

జిల్లాలోని వివిధ ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ పనులను ప్రాధాన్యతా క్రమంలో సకాలంలో పూర్తిచే యాలని కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి ఆదేశించారు.

భూసేకరణ పనులు సకాలంలో పూర్తి చేయాలి

  • కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి

విజయనగరం కలెక్టరేట్‌, మార్చి 24(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని వివిధ ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ పనులను ప్రాధాన్యతా క్రమంలో సకాలంలో పూర్తిచే యాలని కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఆయన ఆయా శాఖల అధి కారులతో సమావేశం నిర్వహించారు. తోటపల్లి బ్యారేజీ, తారకరామ తీర్థసాగర్‌ ప్రాజెక్టులు, బాబూ జగ్జీవన్‌రాం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు, జాతీయ రహదా రి 516(బి), కుర్దారోడ్‌-విజయనగరం మూడో రైల్వే లైన్‌, విజయనగరం నాలుగో రైల్వేలైన్‌ తదితర ప్రాజెక్టుల భూసేకరణపై ఆయన సమీక్షించారు. జేసీ సేతు మాధ వన్‌, డీఆర్వో సత్తిబాబు, ఆర్డీవోలు పాల్గొన్నారు.

గడువులోగా అనుమతులు ఇవ్వాలి

పరిశ్రమల స్థాపనకు అవసరమగు అనుమతులను నిర్ణీత గడువులోగా మంజూరు చేయాలని కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి ఆదేశించారు. పరిశ్రమల అధికారుల తో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో పరిశ్రమల స్థాపన అనుమతుల కోసం సింగిల్‌ విండో విధానం ద్వారా జనవరి 21 నుంచి మార్చి 17వ తేదీ వరకూ 1359 దరఖాస్తులు అందగా.. 1331 దరఖాస్తులకు అనుమతులు ఇచ్చారని తెలిపారు. అదే విధంగా పీఎంఈజీపీ కింద 2025-26 సంవత్సరానికి 499 దరఖాస్తులు అందాయని తెలిపారు. బ్యాంకులకు 387 దరఖాస్తులను పంపామని, మొత్తం 270 దరఖా స్తులు గ్రౌండింగ్‌ పూర్తయ్యాయని చెప్పారు. అనుమ తులన్నీ గడువులోగా ఇస్తామని, భూ సమస్యలను కూడా పరిష్కారిస్తామని దరఖాస్తుదారులు తెలిపారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజరు కరుణాకర్‌ ఉన్నారు.

ప్రజలు సంతృప్తి చెందేలా సేవలందించాలి

కార్పొరేషన్‌ ద్వారా అందిస్తున్న సేవలపై ప్రజలు సంతృప్తి చెందేలా మెరుగైన సేవలందించాలని కార్పొ రేషన్‌ ప్రత్యేకాధికారి రామసుందర్‌రెడ్డి తెలిపారు. సం బంధించిన అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తాగునీటి సరఫరా, వేసవి ప్రణా ళిక, ఇంటింటి చెత్త సేకరణ, మురుగు కాలువలు, పారి శుధ్యం, వీధి లైట్లు, ఆస్తి పన్ను వసూళ్లు, కుళాయి పన్ను వసూళ్లు, అన్న క్యాంటీన్ల నిర్వహణ, ఎల్‌ఆర్‌ఎస్‌ తదితర అంశాలపై సమీక్షించారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో జిల్లాకు మంచి ర్యాంకు వచ్చేలా సేవలు అందించాల న్నారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ కమిషనర్‌ బాల స్వామి, ఈఈ ప్రసాద్‌ పాల్గొన్నారు.

ప్రభుత్వ భవనాల నిర్మాణాన్ని పూర్తి చేయాలి

జిల్లాలో కొనసాగుతున్న వివిధ ప్రభుత్వ భవన నిర్మాణాలు, మౌలిక వసతుల కల్పన పనులను యుద్ధ ప్రాతిపదిక పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఇం జనీరింగ్‌ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పనుల్లో జాప్యం వహించే కాం ట్రాక్టర్లకు నోటీసులు జారీ చేయాలన్నారు. వచ్చే జూన్‌ నాటికి అన్ని భవనాలు పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లా వైద్యాధికారి జీవనరాణి, జిల్లా ఆసుపత్రులు సమ న్వయ కమిటీ అధికారి పద్మశ్రీరాణి ఉన్నారు.

Updated Date - Mar 24 , 2026 | 11:56 PM