గడువులోగా భూసేకరణ పూర్తిచేయాలి
ABN , Publish Date - Jul 08 , 2026 | 12:35 AM
జిల్లాలో చేపడుతున్న ప్రాజెక్టులకు సంబందించిన భూసే కరణ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలన విజయనగరం జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఆదే శించారు.
కలెక్టర్ రామసుందర్ రెడ్డి
విజయనగరం కలెక్టరేట్, జూలై 7(ఆంధ్రజ్యోతి): జిల్లాలో చేపడుతున్న ప్రాజెక్టులకు సంబందించిన భూసే కరణ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలన విజయనగరం జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఆదే శించారు. మంగళ వారం రాత్రి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయా శాఖ అధికారులతో నిర్వహించి న సమావేశంలో మాట్లాడారు. భోగాపురం అంతర్జా తీయ విమానాశ్రయానికి నాలుగు లైన్లు రోడ్డు, విజ యనగరం-సంబల్‌పూర్ మూడో లైన్ పనులు, కొత్త వలస నుంచి విజయనగరం నాలుగో లైన్, ఖుర్ధా రోడ్-విజయనగరం మూడోలైన్ పనులకు సంబం ధించి ప్రాజెక్టులు సకాలంలో పూర్తయ్యే విధంగా చూడాలని కోరారు. గిరిజన విశ్వవిద్యాలయం అప్రో చ్ రోడ్డు, అక్కడ ఏర్పాటు చేయనున్న సబ్ స్టేషన్ పనులతో పాటు, పోలి పల్లి సమీపంలో డేటా సెంట ర్ ఏర్పాటుకు అవసరమైన భూమిని త్వరగా సిద్ధం చేయాలని ఆదేశించారు. సమావేశంలో జేసీ సేతు మాధవన్, డీఆర్వో సత్తిబాబు, ఆర్డీవోలు, ప్రత్యేక ఉపకలెక్టర్లు, సర్వే శాఖ ఏడీ పాల్గొన్నారు.