Share News

భూసేకరణవేగవంతంగా పూర్తి చేయాలి

ABN , Publish Date - May 26 , 2026 | 11:13 PM

జిల్లాలో చేపడుతున్న వివిధ ప్రాజెక్టు లకు సంబంధించి భూసేకరణ వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి ఆదేశించారు.

 భూసేకరణవేగవంతంగా పూర్తి చేయాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి

గిరిజన విద్యాలయానికి హెచ్‌టీ విద్యుత్‌ లైన్‌ను ఏర్పాటు చేయండి

విజయనగరం కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి

విజయనగరం, కలెక్టరేట్‌, మే 26 (ఆంధ్ర జ్యోతి): జిల్లాలో చేపడుతున్న వివిధ ప్రాజెక్టు లకు సంబంధించి భూసేకరణ వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఆయా శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గిరిజన విద్యాలయానికి కొత్తగా హెచ్‌టీ విద్యుత్‌ లైన్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. భూసేకరణ అనంతరం ఆర్థిక అనుమతులు వచ్చిన వెంటనే బిల్లులను అప్‌లోడ్‌ చేయాలన్నారు. సేకరించిన భూము లను ప్రాజెక్టులకు అప్పగించాలని ఆదేశించారు. ఈ సమావేశంలోని జేసీ సేతుమాధవన్‌, ఆర్‌డీవోలు సుధాసాగర్‌, సుధారాణి తదితరులు పాల్గొన్నారు.

రీ సర్వేలో ఇబ్బందులు ఉండకూడదు

గ్రామాల్లో చేపడుతున్న భూ రీసర్వే ప్రక్రియ లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రధాన భూ పరిపాలన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) జయలక్ష్మి నిర్వహించిన వీడియో కాన్పరెన్స్‌లో కలెక్టర్‌తో పాటు జేసీ సేతుమాధవన్‌ పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్‌ జిల్లా అధికారులతో మాట్లాడారు. రైతులకు పాస్‌ పుస్తకాలు పంపిణీ చేయాలని ఆదేశించారు. ప్రజలకు రెవెన్యూ సేవలు వేగవంతంగా, పారదర్శకంగా అందించ డమే ల క్ష్యంగా పని చేస్తున్నామని పేర్కొన్నారు. గ్రామస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తూ త్వరితగతిన సమస్యలు పరిష్కరించాలన్నారు.

ఓటర్ల జాబితా సవరణకు సిద్ధం కావాలి

కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన ఆదేశాల మే రకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు సిద్ధం కావాలని కలెక్టర్‌ సంబంధిత అధికారు లను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం అమరా వతి నుంచి రాష్ట్ర ఎన్నికల అధికారి వివేక్‌యాదవ్‌, చీప్‌ సెక్రటరీ సాయిప్రసాద్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఓటర్ల జాబితా సమగ్ర సవరణకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించా రు. ఈ సవరణ జూన్‌ 15 నుంచి ప్రారంభం కానున్నాదని చెప్పారు. జూన్‌ 5 నుంచి 14 వరకూ శిక్షణ ఫారాల ముద్రణ వంటి సన్నాహక కార్యక్రమాలు ఉంటా యని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్‌వో సత్తిబాబు ఉన్నారు.

Updated Date - May 26 , 2026 | 11:14 PM