Share News

గడువులోగా భూసేకరణ పూర్తి చేయాలి

ABN , Publish Date - Aug 05 , 2026 | 12:13 AM

జిల్లాలో కొనసాగుతు న్న ప్రాజెక్టులకు సంబం ధించిన భూసేకరణ గడువులోగా పూర్తి చేయాలని జేసీ సేతు మాధవన్‌ ఆదేశించారు.

గడువులోగా భూసేకరణ పూర్తి చేయాలి

  • జేసీ సేతుమాధవన్‌

విజయనగరం కలెక్టరే ట్‌, ఆగస్టు 4(ఆంధ్రజ్యో తి): జిల్లాలో కొనసాగుతు న్న ప్రాజెక్టులకు సంబం ధించిన భూసేకరణ గడువులోగా పూర్తి చేయాలని జేసీ సేతు మాధవన్‌ ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఆయా శాఖల అధికారులతో నిర్వహించిన సమావే శంలో ఆయన మాట్లాడారు. భోగాపురం విమానాశ్రయానికి నాలుగు లేన్ల రహదారి, ఒబేరాయ్‌, మేఫైర్‌ హోటళ్లు, విజయనగరం-సంబల్‌పూర్‌ మూడో లైన్‌ పనులు, కొత్తవలస, విజయనగరం నాలుగో లైన్‌, ఖుర్ధారోడ్‌ -విజయనగరం మూడో లైన్‌ పనులకు సంబంధించి సమీక్షించారు. భూ యజమానులకు సకాలంలో పరిహారం అందేలా చూడాలన్నారు. ప్రాజెక్టులు అన్ని సకాలంలో పూర్తి అయ్యే విధంగా చూడా లన్నారు. అలాగే రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. రీసర్వే గ్రామాల్లో పట్టాదారుని పాస్‌ పుస్తకాలు పంపిణీ చేయాలన్నారు. ఈ సమావేశంలో డీఆర్వో సత్తిబాబు, సర్వే శాఖ ఏడీ విజయకుమార్‌, ఆర్డీవో సుధాసాగర్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 05 , 2026 | 12:14 AM