లక్ష్యాల్లో వెనుకబాటును సహించేది లేదు
ABN , Publish Date - Sep 02 , 2026 | 12:16 AM
గ్రామాల్లో అమలవుతున్న వీబీజీ రామ్‌జీ పథకంలో కూలీల సంఖ్య పెంచాలని, నిర్దేశిత లక్ష్యాల్లో వెనుకబాటును సహించేది లేదని డ్వామా పీడీ శారదాదేవి సిబ్బందిని హెచ్చరించారు.
డ్వామా పీడీ శారదాదేవి
రేగిడి, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో అమలవుతున్న వీబీజీ రామ్‌జీ పథకంలో కూలీల సంఖ్య పెంచాలని, నిర్దేశిత లక్ష్యాల్లో వెనుకబాటును సహించేది లేదని డ్వామా పీడీ శారదాదేవి సిబ్బందిని హెచ్చరించారు. మంగళవారం స్థాని క ఎంపీడీవో కార్యాలయంలో వీబీజీ రామ్‌జీ పథకంపై టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లతో రాజాం ఏపీడీ చంద్రకుమారి సమక్షంలో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. మండలంలోని 39 పంచాయతీలకు గాను 38 పంచాయతీల్లో ఉ పాధి పనులు చేయటం, ఈ పనుల్లో లేబర్ సంఖ్య నాలుగు వేలు దాటి ఉండాల్సి ఉండగా కేవలం 2 వేల లోపు ఉండటం గమనించిన ఆమె సిబ్బందిపై తీవ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తం చేశారు. లేబర్ సంఖ్య తక్కువ ఉండటాన్ని ఏపీవో శ్రీనివాసరావును ఆమె వివరణ కోరారు. తక్షణమై లేబర్ సంఖ్య పెంచాలని, పండ్ల తోటలు పెంపకంలో లక్ష్యాలు చేరుకోవాలని ఆమె ఆదేశించారు. రైతుల తోటల్లో కందకాలు తవ్వటం, పండ్లు పెంపకంపై చైతన్యం తీసుకురావాలని, మండలంలో 100 ఎకరాల్లో పండ్లు తోటలు పెంపకం లక్ష్యం కాగా ఇప్పటికి 30 ఎకరాలు ఉం డటంపై ఆమె తీవ్రంగా స్పందించి తక్షణమే లక్ష్యాలు పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ సమీక్షలో ఎంపీడీవో శ్యామలాకుమారి, సిబ్బంది ఉన్నారు.
కాలువ గట్లపై మొక్కలు నాటాలి..
వంగర, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): ఉపాధిహామీ పథకం ద్వారా గ్రామాల్లోని ప్రతి కాలువ గట్లు, చెరువు గట్లపై పూర్తిస్థాయిలో మొక్కలు నాటాలని ఉపాధి హామీ పీడీ శారదాదేవి ఆదేశించారు. మంగళవారం స్థానిక ఎంపీడీవో కార్యాల యంలో సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించి.. కీలక ఆదేశాలు జారీ చేశా రు. కాలువ గట్లపై హరితహారం పేరిట పెద్దఎత్తున మెక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలన్నారు. అలాగే గ్రామాల్లో ప్రతి వేతనదారుడు వర్మీ కంపోస్ట్ పిట్లు తవ్వకాలు ప్రారంభించి, సేంద్రియ ఎరువుల తయారీకి చర్యలు తీసుకోవాల న్నారు. ఏపీడీ చంద్రకుమారి, సిబ్బంది పాల్గొన్నారు.