Share News

ప్రక్షాళన లేక.. పర్యవేక్షణకు నోచుకోక

ABN , Publish Date - Oct 25 , 2026 | 12:16 AM

బొబ్బి లిలో ప్రక్షాళన లేకపోవడంతోపాటు అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో వర్షాకాలంలో సైతం తాగునీటికి అవస్థలు తప్పడం లేదు.

ప్రక్షాళన లేక.. పర్యవేక్షణకు నోచుకోక
మునిసిపల్‌ కుళాయి ప్లాట్‌ఫారం వద్ద నీటిని పట్టుకొంటున్న దృశ్యం

  • ఇదీ బొబ్బిలిలో తాగునీటి సమస్య పరిస్థితి

బొబ్బిలి, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): బొబ్బి లిలో ప్రక్షాళన లేకపోవడంతోపాటు అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో వర్షాకాలంలో సైతం తాగునీటికి అవస్థలు తప్పడం లేదు. కొన్నిచోట్ల పబ్లిక్‌ కుళాయిల నుంచి నీరు వృథాగా పోతు న్నా నిరోధించేందుకు చర్యలు తీసుకోవడంలే దని పలువురు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

బొబ్బిలిలోని దాసరివీధిలో మునిపిపల్‌ పబ్లి క్‌ కుళాయిల నుంచి నీరు వృథాగా పోతోంది. వాస్తవానికి పట్టణంలో రెండు రోజులకోసారి మునిసిపాలిటీ కుళాయిలు ద్వారా అధికారికం గా నీరు అందజేస్తున్నారు. ఇదే సమయంలో మరికొన్ని వార్డుల్లో సాంకేతిక కారణాల వల్ల నాలుగైదు రోజులకోసారి నీరందిస్తున్నారు. గొల్లవీధి తదితర ప్రాంతాల్లో తాగునీటి సమస్య ఎక్కువగా ఉంటోంది. పలు చోట్ల కుళాయిల ద్వారా వస్తున్న నీరు వృథాగా మురుగు కాలు వల ద్వారా పోతోంది. ఇంటింటి కుళాయిలు ఉన్న చోట పబ్లిక్‌కుళాయిల ద్వారా నీరు వృథా అవుతోంది. దాసరి వీధిలో అందరికీ వ్యక్తిగత కుళాయిలు ఉండడంతో పబ్లిక్‌ కుళాయిల ద్వారా నీరు వృథాఅవుతోందని స్థానికులు చెబుతున్నారు. కంచరవీధి ఓంకార్‌ థియేటర్‌ సెంటరు, గొల్లపల్లి, భూముల వీధితో పాటు పలు ప్రాంతాల్లో మునిసిపల్‌ కుళాయిల దగ్గర నీరు పట్టుకునేందుకు నాలుగైదు అడుగుల లోతులో గోతులు ఏర్పా టు చేసుకోవాల్సిన దుస్ధితి నెలకొంది. అనేక చోట్ల పబ్ల్లిక్‌ కుళా యిల దగ్గర ప్లాట్‌ఫారాలు పాడవడంతో అక్కడ నీరు నిల్వగా ఉంటోంది. దీంతో నీరు నిల్వ ఉన్నచోట నిలబడి కుళాయిల నీటిని పట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. తక్షణమే మునిసిపల్‌ అధికారులు స్పం దించి తాగునీటి వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి నీటి కష్టాలు గట్టెక్కించాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Oct 25 , 2026 | 12:16 AM