Share News

పారిశుధ్య లోపమే వ్యాధులకు కారణం

ABN , Publish Date - Nov 28 , 2026 | 12:23 AM

Lack of Sanitation Is the Root Cause of Diseases పారిశుధ్య లోపమే సకల రోగాలకు కారణమని జిల్లా మలేరియా అధికారి సూర్యనారాయణ అన్నారు. ఫ్రైడే-డ్రైడేలో భాగంగా శుక్రవారం కురుపాం గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహాన్ని ఆయన సందర్శించారు.

పారిశుధ్య లోపమే వ్యాధులకు కారణం
బాలికల ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటున్న డీఎంవో

  • కురుపాం గురుకులం పరిశీలన

కురుపాం,నవంబరు27(ఆంధ్రజ్యోతి): పారిశుధ్య లోపమే సకల రోగాలకు కారణమని జిల్లా మలేరియా అధికారి సూర్యనారాయణ అన్నారు. ఫ్రైడే-డ్రైడేలో భాగంగా శుక్రవారం కురుపాం గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహాన్ని ఆయన సందర్శించారు. సిక్‌ రూమ్‌లో ఉన్న బాలికలను పరామర్శించారు. వారి ఆరోగ్యంపై ఆరా తీశారు. కాగా వసతి గృహ ఆవరణలో లార్వా ఉనికిని గమనించారు. సత్వరమే వాటిని నిర్ములించి విద్యార్థినుల ఆరోగ్య పరిరక్షణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రిన్సిపాల్‌కి సూచించారు. మలేరియాపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రతివారం ఫ్రైడే-డ్రైడే నిర్వహించడం ద్వారా లార్వాను, దోమలను నిర్మూలించగలమని చెప్పారు. ఈ పరిశీలనలో సూపర్‌వైజర్‌ జి.జయ తదితరులు ఉన్నారు.

Updated Date - Nov 28 , 2026 | 12:23 AM