Share News

అణగారిన వర్గాల ఆశాజ్యోతి లచ్చన్న’

ABN , Publish Date - Aug 17 , 2026 | 12:11 AM

అణగారిన వర్గాల ఆశాజ్యోతి సర్దార్‌ గౌతు లచ్చన్న అని ఏఆర్‌ డీఎస్పీ థామస్‌రెడ్డి అన్నారు.

అణగారిన వర్గాల ఆశాజ్యోతి లచ్చన్న’
లచ్చన్న చిత్రపటం ఎదుట నివాళులర్పిస్తున్న డీఎస్పీ, తదితరులు

బెలగాం, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): అణగారిన వర్గాల ఆశాజ్యోతి సర్దార్‌ గౌతు లచ్చన్న అని ఏఆర్‌ డీఎస్పీ థామస్‌రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో లచ్చన్న జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ బడుగు బలహీనవర్గాల హక్కుల కోసం పోరాడిన మహనీయుడు లచ్చన్న అని కొనియాడారు. సామాజిక అసమానతల నిర్మూలనకు కృషి చేశారన్నారు. పేదలు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి లచ్చన్న చేసిన సేవలు నిరుపమానం అన్నారు. ప్రజా సమ స్యలపై పోరాడుతూ సామాజిక న్యాయం, సమానత్వం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు కృషి చేశారని ప్రశంసించారు. కార్యక్రమంలో ఆర్‌ఐలు నాయుడు, రాంబాబు, ఏఆర్‌ ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Aug 17 , 2026 | 12:11 AM