లారీ ఢీకొని కూలీ మృతి
ABN , Publish Date - May 10 , 2026 | 12:31 AM
లారీ ఢీకొని దినసరి కూలీ మృతిచెందిన ఘటన శనివా రం చోటుచేసుకుంది.
జామి, మే 9(ఆంధ్రజ్యోతి): లారీ ఢీకొని దినసరి కూలీ మృతిచెందిన ఘటన శనివా రం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రం జామి రాయిచెట్టు సెంటర్ నెయ్యిలవీధికి చెందిన భీల అచ్చన్న(55) దినసరి కూలీగా జీవనం సాగిస్తున్నాడు. శనివారం ఉదయం దొండపర్తి వద్ద వ్యవసాయ క్షేత్రంలో కూలి పనులకు వెళ్లాడు. తిరిగి 10 గంటల సమ యంలో ఇంటికి చద్దనం తినేందుకు బయలుదేరాడు. సైకిల్‌పై ఇంటికి వస్తున్న అచ్చన్న ఏబీనగర్ లోని వినాయకుడు గుడి వద్దకు రాగానే.. ఎదురుగా పెళ్లికి సంబంధించిన డీజే వస్తోం ది. దీంతో ఆయన హడావుడిగా రోడ్డు పక్క నుంచి వెళ్తున్నా డు. ప్రమదవశాత్తు అదే దారిలో వెళ్తున్న లారీ వెనుక చక్రం కిందకు తూలి పడిపోయాడు. దీంతో లారీ చక్రం అతని తలపై ఎక్కడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ విషయంపై ఎస్‌ఐ వైవీ జనార్దన్ వివరణ కోరగా.. మృతుడు ప్రయాణిస్తున్న సైకిల్ లారీ వెనుక భాగానికి తగిలిందన్నారు. ఆయన సైకిల్‌పై వస్తున్న సమ యంలో కొంచెం అలసటగా కనిపించాడని స్థానికులు తెలిపా రన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయాల్సి ఉందని తెలిపారు. తన భర్త మరణంతో భార్య కనకమ్మ రోదన చూపరులను కంటతడి పెట్టించింది.