Share News

లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలి

ABN , Publish Date - Apr 02 , 2026 | 12:15 AM

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని సీఐటీయూ నాయకుడు బి.సూర్యనారాయణ కోరారు. ఈ మేరకు భోగాపురంలో బుధవారం బ్లాక్‌ డే పేరుతో లేబర్‌కోడ్‌కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ నాయకులు జి.ప్రవీణ, శ్రీలక్ష్మి, అనిత పాల్గొన్నారు.

లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలి
కొత్తవలస: నిరసన తెలుపుతున్న జ్యూట్‌మిల్లు వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు:

భోగాపురం, ఏప్రిల్‌1(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని సీఐటీయూ నాయకుడు బి.సూర్యనారాయణ కోరారు. ఈ మేరకు భోగాపురంలో బుధవారం బ్లాక్‌ డే పేరుతో లేబర్‌కోడ్‌కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ నాయకులు జి.ప్రవీణ, శ్రీలక్ష్మి, అనిత పాల్గొన్నారు.

ఫ కొత్తవలస, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): కేంద్రప్రభుత్వం నాలుగు లేబర్‌కోడ్‌లకు అమలులోకి తీసుకురావడంతో బుధవారం కొత్తవలసజూట్‌మిల్లుకు చెందిన కార్మికులు ఏఐఎఫ్‌టీయు(న్యూ)రాష్ట్ర అఽధ్యక్షుడు గణేష్‌ పండా ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు పెట్టుకుని బ్లాక్‌డే పాటించారు. కార్యక్రమంలో కొత్తవలస జూట్‌మిల్లు కార్మిక సంఘం నాయకులు కర్తు శ్రీను, కె.ఈశ్వరరావు, ఎస్‌.గోవింద, ఎస్‌.రాంబాబు పాల్గొన్నారు.

ఫ నెల్లిమర్ల, ఏప్రిల్‌ 1(ఆంధ్రజ్యోతి): లేబర్‌కోడ్‌లు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రావడంతో బ్లాక్‌డేగా నిర్వహించాలని కేంద్ర కార్మికసంఘాలు పిలుపు మేరకు నెల్లిమర్ల నగర పంచాయతీ కార్మికులు నల్ల రిబ్బన్లు ధరించి బుధవారం నిరసన తెలియజేశారు. ఈ కార్య క్రమంలో ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ జిల్లా కోశాధికారి బి.హరిబాబు, రామలక్షి్క్ష, బాలరాజు, శంకరరావు, దుర్గారావు పాల్గొన్నారు.

ఫలక్కవరపుకోట, ఏప్రిల్‌ 1(ఆంధ్రజ్యోతి): లేబర్‌ కోడ్‌లను వెంటనే ఉపసం హరించుకోవాలని ఎల్‌.కోటలోని అంబేడ్కర్‌ కూడలి వద్ద సీఐటీయు నాయకులు గాడి అప్పారావు, తరిణి వెంకటరమణ నిరసన తెలిపారు.

Updated Date - Apr 02 , 2026 | 12:15 AM