Share News

లేబర్‌ కోడ్లను రద్దు చేయాలి

ABN , Publish Date - Feb 13 , 2026 | 12:08 AM

కార్మిక, రైతులకు సంబంధించిన నాలుగు లేబర్‌ కోడ్లను రద్దు చేయాలని వామపక్ష, ప్రతిపక్ష, ప్రజా సంఘాల నాయకులు గురువారం ర్యాలీ నిర్వహించారు.

 లేబర్‌ కోడ్లను రద్దు చేయాలి
పార్వతీపురం పట్టణంలో ర్యాలీ నిర్వహిస్తున్న ప్రతిపక్ష, వామపక్ష, ప్రజాసంఘాల నాయకులు

-వామపక్ష, ప్రజా సంఘాలు ర్యాలీ

పార్వతీపురం/టౌన్‌, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): కార్మిక, రైతులకు సంబంధించిన నాలుగు లేబర్‌ కోడ్లను రద్దు చేయాలని వామపక్ష, ప్రతిపక్ష, ప్రజా సంఘాల నాయకులు గురువారం ర్యాలీ నిర్వహించారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవనం నుంచి పాతబస్టాండ్‌ కూడలి వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్‌ కోడ్లు కార్మిక, కర్షకులతో పాటు అన్ని వర్గాల వారికి నష్టదాయకంగా ఉన్నాయన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలన్నారు. కొత్త ఉపాధి చట్టాన్ని రద్దు చేసి, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ను కొనసాగించి 200 రోజుల పనిని కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు జీవీ రమణ, ఏపీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు జి.కిషోర్‌, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు వి. దాలినాయుడు, సీపీఐ నాయకులు కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 13 , 2026 | 12:08 AM