మూడు పురాలు.. 13 మండలాల్లో కూటమిదే జోరు
ABN , Publish Date - Nov 21 , 2026 | 11:58 PM
kutami Dominance Across Three Municipalities and 13 Mandals స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయ పరంపర కొనసాగించింది. మూడు పురాలు.. 13 మండలాల్లో కూటమి పార్టీల అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు.
అన్నిచోట్లా విజయం సాధించిన కూటమి అభ్యర్థులు
రెండు మండలాలు, ఐదు జడ్పీటీసీలకే వైసీపీ పరిమితం
పార్వతీపురం, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయ పరంపర కొనసాగించింది. మూడు పురాలు.. 13 మండలాల్లో కూటమి పార్టీల అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. పార్వతీపురం, సాలూరు పురపాలక సంఘాలతో పాటు పాలకొండ నగర పంచాయతీలో టీడీపీ, జనసేన అభ్యర్థులు చైర్పర్సన్లుగా గెలుపొందారు. అత్యధిక వార్డులో కూటమి అభ్యర్థులు కౌన్సిలర్లుగా విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక జిల్లాలోని 15 మండలాల్లోని 13 చోట్ల కూటమి పార్టీ అభ్యర్థులు ఎంపీపీ , వైస్ ఎంపీపీలుగా కొలువుదీరారు. సీతంపేట, మక్కువ మండలాల్లో మాత్రమే వైసీపీ ఎంపీపీ స్థానాలను దక్కించుకుంది. 226 ఎంపీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు 162 స్థానాల్లో విజయం సాధించారు. కేవలం 62 స్థానాలకే వైసీపీ పరిమితమైంది. జిల్లాకు కొత్తగా ఏర్పడిన జిల్లా ప్రజా పరిషత్ పీఠం కూడా కూటమికే దక్కింది. 15 జడ్పీటీసీ స్థానాల్లో పది ఏడు టీడీపీ, మూడు జనసేన అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. ఈ క్రమంలో జడ్పీ చైర్పర్సన్, వైస్ చైర్మన్గా జనసేన, టీడీపీ అభ్యర్థులు కొలువుదీరారు. ఏదేమైనా స్థానిక ఎన్నికల్లోనూ వైసీపీకి ప్రజలు మరోసారి ఓటుతో గట్టిగా బుద్ధి చెప్పారనే వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి.