సుపరిపాలనలో కురుపాంకు ఐఎస్‌వో గుర్తింపు
ABN , Publish Date - Jul 16 , 2026 | 11:25 PM
సుపరిపాలనలో కురుపాం మేజర్ పంచాయతీకి ఐఎస్‌వో గుర్తింపు లభించింది. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడం, సమర్థంగా దస్త్రాల నిర్వహణ, పారిశుధ్యం, పారదర్శక పరిపాలన, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాల్లో ఉత్తమ పని తీరు కనబరిచినందుకు అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ ఐఎస్‌వో ధ్రువీకరణ పత్రాలు అందజేసింది.
కురుపాం,జూలై16(ఆంధ్రజ్యోతి): సుపరిపాలనలో కురుపాం మేజర్ పంచాయతీకి ఐఎస్‌వో గుర్తింపు లభించింది. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడం, సమర్థంగా దస్త్రాల నిర్వహణ, పారిశుధ్యం, పారదర్శక పరిపాలన, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాల్లో ఉత్తమ పని తీరు కనబరిచినందుకు అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ ఐఎస్‌వో ధ్రువీకరణ పత్రాలు అందజేసింది. రాష్ట్రంలో 23 గ్రామ పంచాయతీలకు ఈ పత్రాలు అందించగా.. అందులో కురుపాం కూడా ఉండడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కాగా తాడేపల్లిలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయంలో పీఆర్ శాఖ కమిషనర్ కృష్ణతేజ చేతుల మీదుగా కురుపాం మేజర్ పంచాయతీ ఈవో వెంకటనాయుడు ఐఎస్‌వో ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవో జె.ఉమామహేశ్వరి, డిప్యూటీ ఎంపీడీవో జి.రమేష్‌బాబు తదితరులు అభినందనలు తెలిపారు. సిబ్బంది సమష్టి కృషితోనే ఈ గుర్తింపు సాధ్యమైందని, మండలానికే ఇది గర్వకారణమని వారు చెప్పారు.