Kumkis రంగంలోకి కుంకీలు
ABN , Publish Date - Sep 08 , 2026 | 12:36 AM
Kumkis Enter the Field కొమరాడ మండలం నుంచి ఏనుగులు కదలడం లేదు. కొద్దిరోజులుగా ఈ ప్రాంతంలోనే సంచరిస్తూ గ్రామస్థులను భయాందోళనకు గురి చేస్తున్నాయి పంటలను ధ్వంసం చేస్తూ రైతులను నష్టపరిస్తున్నాయి. ఆదివారం రాత్రి కందివలసలో ఏనుగులు బీభత్సం సృష్టించింది. ఓ రైతుకు చెందిన రెండు ఎకరాల మొక్కజొన్న పంటను ధ్వంసం చేశాయి.
వాటి కట్టడికి ప్రత్యేక ఆపరేషన్
పార్వతీపురం/కొమరాడ, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): కొమరాడ మండలం నుంచి ఏనుగులు కదలడం లేదు. కొద్దిరోజులుగా ఈ ప్రాంతంలోనే సంచరిస్తూ గ్రామస్థులను భయాందోళనకు గురి చేస్తున్నాయి పంటలను ధ్వంసం చేస్తూ రైతులను నష్టపరిస్తున్నాయి. ఆదివారం రాత్రి కందివలసలో ఏనుగులు బీభత్సం సృష్టించింది. ఓ రైతుకు చెందిన రెండు ఎకరాల మొక్కజొన్న పంటను ధ్వంసం చేశాయి. సోమవారం సాయంత్రానికి గజరాజులు కోనవలస పరిసరాలకు చేరాయి. దీంతో ఆ ప్రాంతవాసులు హడలిపోతున్నారు. ఈ క్రమంలో ట్రాకర్లు వాటి కదలికలను గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో వారు కుంకీ ఏనుగులు జయంత్, అభిమన్యులను రంగంలోకి దించారు. వాటి సాయంతో గజరాజుల గుంపును వేరే ప్రాంతానికి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. ‘కొమరాడ మండలం కోనవలసలో సంచరిస్తున్న ఏనుగులను కుంకీల సహకారంతో అటవీ ప్రాంతానికి తరలించేందుకు సోమవారం రాత్రి నుంచి ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తున్నాం. ’ అని ఫారెస్ట్ రేంజర్ మణికంఠేష్ తెలిపారు.