గ్యాస్ర్టో సూపర్ స్పెషాలిటీ విభాగంలో కృష్ణ చైతన్య ప్రతిభ
ABN , Publish Date - Mar 09 , 2026 | 12:23 AM
గంట్యాడ మండలం గొడియాడ గ్రామానికి చెందిన డాక్టర్ బొబ్బి లి కృష్ణచైతన్య గ్యాస్ర్టో సూపర్ స్పెషాలిటీ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారు.
బంగారు పతకం కైవసం
విజయనగరం, మార్చి 8(ఆంధ్రజ్యోతి): గంట్యాడ మండలం గొడియాడ గ్రామానికి చెందిన డాక్టర్ బొబ్బి లి కృష్ణచైతన్య గ్యాస్ర్టో సూపర్ స్పెషాలిటీ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారు. ఈ విభాగంలో 800 మార్కు లకు గాను 576 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించారు. ఈయన తండ్రి నరసింహమూర్తి న్యా యవాది. తల్లి కొండమ్మ గృహిణి. కృష్ణ చైతన్య సతీమణి గాడి దేదీప్య గైనకాలజిస్ట్ వైద్య విద్య ను అభ్యసిస్తున్నారు. ఈ సందర్భంగా కృష్ణ చైతన్య మా ట్లాడుతూ సొంత ప్రాంతమైన విజయనగరంలోనే వైద్యసేవలందించాలని లక్ష్యంగా పెట్టుకున్నానని తెలిపారు. తీవ్రమైన ఒత్తిడి, ఆహారపు అలవాట్ల కారణంగా గ్యాస్ట్రో ఎంట్రాలజీ సమస్య లు ఉత్పన్నమవుతాయని, క్రమశిక్షణాయుతమైన జీవితం తో క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే ఈ సమస్యలను అధిగమించవచ్చని చెప్పారు.