Share News

Kotadurgamma.. కోటదుర్గమ్మా.. కరుణించు

ABN , Publish Date - Aug 14 , 2026 | 11:57 PM

Kotadurgamma.. Bless Us with Your Grace శ్రావణమాసం తొలి శుక్రవారం సందర్భంగా ఉత్తరాంధ్రుల ఇలవేల్పు పాలకొండ కోటదుర్గమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు. ప్రత్యేక అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

Kotadurgamma..    కోటదుర్గమ్మా.. కరుణించు
కుంకుమపూజలు నిర్వహిస్తున్న దృశ్యం

  • ఆలయానికి పోటెత్తిన భక్తులు

పాలకొండ, ఆగస్టు14(ఆంధ్రజ్యోతి): శ్రావణమాసం తొలి శుక్రవారం సందర్భంగా ఉత్తరాంధ్రుల ఇలవేల్పు పాలకొండ కోటదుర్గమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు. ప్రత్యేక అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈవో వీవీ సూర్యనారాయణ పర్యవేక్షణలో ప్రధాన అర్చకుడు డి.లక్ష్మీ ప్రసాదశర్మ ఆధ్వర్యంలో కోటదుర్గమ్మకు తెల్లవారుజామున మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్ఛరణలతో ప్రత్యేక పూజలు, పంచామృతా భిషేకం, కొబ్బరికాయల సమర్పణ వంటివి నిర్వహించారు. అనంతరం సుమారు 2 వేల మంది మహిళా భక్తులతో సామూహిక కుంకుమపూజ, లలితదేవి పూజలు జరిపారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు.

Updated Date - Aug 14 , 2026 | 11:57 PM