20న కోటదుర్గమ్మ తిరువీధి
ABN , Publish Date - Oct 17 , 2026 | 12:16 AM
పాలకొండలోని కోటదుర్గమ్మ దసరా ఉత్స వాల్లో భాగంగా ఈనెల 20న నిర్వహించనున్న తిరువీధి విజయవంతంగా నిర్వహిం చేందుకు ఆలయ, పోలీస్ అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టారు.
పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తాం: డీఎస్పీ
పాలకొండ, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): పాలకొండలోని కోటదుర్గమ్మ దసరా ఉత్స వాల్లో భాగంగా ఈనెల 20న నిర్వహించనున్న తిరువీధి విజయవంతంగా నిర్వహిం చేందుకు ఆలయ, పోలీస్ అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టారు. ఈ మేరకు ఈవో వీవీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో పాలకొండలో శుక్రవారం డీఎస్పీ రాంబాబు, సీఐ ప్రసాద్, ప్రధాన అర్చకులు సమావేశమై కార్యక్రమం నిర్వహణపై చర్చించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ తిరువీధి సాయంత్రం ఆరుగంటలకే ప్రారంభించా లని సూచించారు. అంతకుముందు నిర్వహించాల్సిన ఆయుధ పూజతో పాటు అమ్మ వారికి సంబంధించిన పూజలను త్వరగా పూర్తి చేయాలన్నారు. ఉత్సవాలు సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తా మని, పోలీస్సిబ్బంది అప్రమత్తంగా ఉంటారని డీఎస్పీ తెలిపారు. ప్రధాన అర్చకులు దార్లపూడి లక్ష్మీ ప్రసాదశర్మ మాట్లాడుతూ ఉత్సవాలను భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆనదోత్సాహాల మధ్య జరిగేలా ఏర్పాటు చేస్తామన్నారు.సమావేశంలో ఎస్ఐలు శివప్రసాద్, నీలకంఠారావు, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాసశర్మ, సీసీ రాజారావు తదితరులు పాల్గొన్నారు. కాగా కోటదుర్గమ్మ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏపీ ఎన్జీవో సంఘం శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు హనుమంతు సాయిరాం కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు.