రోడ్డెక్కిన కొండమల్లిపూడి గిరిజనులు
ABN , Publish Date - Jan 25 , 2026 | 12:22 AM
వెంకట రమణపేట శివారు కొండమల్లిపూడి గిరిజనులు శనివా రం రోడ్డెక్కారు.
పోలీస్‌స్టేషన్, తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన
శృంగవరపుకోట, జనవరి 24(ఆంధ్రజ్యోతి): వెంకట రమణపేట శివారు కొండమల్లిపూడి గిరిజనులు శనివా రం రోడ్డెక్కారు. న్యాయం కోసం పోలీస్‌స్టేషన్, తహసీ ల్దార్ కార్యాలయాల వద్ద ఆందోళనకు దిగారు. వివరా ల్లోకి వెళ్తే.. కొండమల్లిపూడి గ్రామ పరిధిలోని గిరిజను లు తన భూమిలోని చెట్లను నరికేశారంటూ ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో పేర్కొన్న వ్యక్తులను స్టేషన్‌కు రావాలని పోలీసులు సమాచారం పంపించారు. అయితే ఈ గ్రామ పరిధిలో నివశిస్తున్న గిరజనులంతా శుక్రవారం పోలీస్ స్టేషన్‌కు తరలివచ్చా రు. రాత్రి వరకు అక్కడే ఉండిపోయారు. ఫిర్యాదులో పేర్కొన్న నలుగురు తప్ప మిగిలిన వారంతా వెళ్లిపోవా లని పోలీసులు చెప్పినా వారు వినిపించుకోలేదు. ఈ సమయంలో స్థానిక సీపీఎం నాయకుడు చెలికాని ముత్యాలు, ఓ గిరిజన యువకుడిపై సీఐ వీఎన్ మూర్తి చేయి చేసుకున్నారని తెలిసి.. శనివారం ఉదయం సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ, రైతు సంఘం నాయకులు చల్లా జగన్, జె.గౌరీలు గిరి జనులతో కలిసి స్టేషన్‌కు చేరుకుని, ప్రశ్నించారు. తానేమీ చేయి చేసుకోలేదని సీఐ సమాధానం ఇచ్చారు. భూమి విషయాన్ని రెవెన్యూ అధికారులతో తెల్చుకో వాలని సూచిం చారు. దీంతో వారంతా తహసీల్దార్ కార్యాలయానికి ర్యాలీగా వచ్చారు. కార్యాలయం ముం దు బైఠాయించారు. ఈ భూమి జిరాయితీగా రికార్డులు చెబుతున్నాయని, వెబ్‌లాండ్‌లో 22(ఎ)గా ఎందుకు నమోదైందో తనకు తెలియదని తహసీల్దార్ డి.శ్రీనివా సరావు తెలిపారు. గిరిజనులకు పొజిషన్ పట్టాలు ఇవ్వ లేమని, ప్రస్తుతం సాగులో ఉన్నట్టు ఎండాస్‌మెంటు ఇస్తామని చెప్పారు. ఈమేరకు ఎండాస్‌మెంటు ఇవ్వ డంతో గిరిజనులు శాంతించారు.