‘పుస్తక పఠనంతో విజ్ఞానం’
ABN , Publish Date - Jun 07 , 2026 | 12:01 AM
: పుస్తక పఠనంతోనే విజ్ఞానం లభిస్తుందని రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులు జనార్దనరావు, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంఘ నాయకులు నూతులపాటి భరత్‌భూషణ్ పేర్కొన్నారు.
పాలకొండ, జూన్ 6(ఆంధ్రజ్యోతి): పుస్తక పఠనంతోనే విజ్ఞానం లభిస్తుందని రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులు జనార్దనరావు, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంఘ నాయకులు నూతులపాటి భరత్‌భూషణ్ పేర్కొన్నారు. శనివారం పాలకొండ శాఖా గ్రంథాలయంలో వేసవి శిక్షణ శిబిరం ముగిసింది. ఈ సందర్భంగా పలు పోటీల్లో గెలుపొందిచన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్య క్రమంలో గ్రంథాలయాధికారి బబ్బురు గణేష్, ఉపాధ్యాయులు నగేష్‌కుమార్, మండల వెంకటరమణ, గొర్లె మురళి పాల్గొన్నారు.
ఫ గరుగుబిల్లి, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): గరుగుబిల్లి శాఖా గ్రంథాలయంలో వేసవి శిక్షణ శిబిరం శనివారం ముగిసింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వేసవి సెలవుల్లో గ్రంథాలయ నిర్వాహకులు నల్ల మధుసూదనరావు విజ్ఞానం పెంపొందించేందుకు పరీక్షలు, పలు రకాల క్రీడలను నిర్వహించారు. ముగిం పు పురస్కరించుకుని పలు రకాల పోటీల విజేతలకు బహుమతులను అం దించారు.కార్యక్రమంలో రావుపల్లి పుస్తక కేంద్ర నిర్వాహకులు శ్రావణి, కె.స్వామి నాయుడు పాల్గొన్నారు.