Share News

సమస్యలు తెలుసుకుని.. పరిష్కారానికి హామీ ఇచ్చి

ABN , Publish Date - Feb 10 , 2026 | 12:03 AM

మండలంలోని కృపావలస, దీవెనవలస, రామన్నవలస, మోసాయివలస, చిన అక్కేన వలస గిరిజన గ్రామాల్లో సోమవారం ఎమ్మెల్యే బేబీనాయన పర్యటించారు.

సమస్యలు తెలుసుకుని.. పరిష్కారానికి హామీ ఇచ్చి
కృపావలసలో గిరిజనులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే బేబీనాయన

బొబ్బిలి రూరల్‌, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కృపావలస, దీవెనవలస, రామన్నవలస, మోసాయివలస, చిన అక్కేన వలస గిరిజన గ్రామాల్లో సోమవారం ఎమ్మెల్యే బేబీనాయన పర్యటించారు. ఆయనతో పాటు నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జి గిరడ అప్పల స్వామి ఉన్నారు. ఇటీవల తమకు ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ గిరిజనులు వినూత్నంగా తెలిపిన విషయం తెలిసిందే. తమ సమస్యలు పరిష్కరించాలని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు వారు అభ్యర్థిం చారు. దాంతో ఎమ్మెల్యే, జనసేన ఇన్‌చార్జి అక్కడ గిరిజనులతో మాట్లాడారు. వారి సమ స్యలను అడిగి తెలుసుకున్నారు. అఽధికారులతో మాట్లాడి తక్షణమే ఆ ప్రాంతాన్ని సర్వే చేసి రోడ్డు నిర్మాణానికి చర్యలు చేపట్టాలని ఆదేశిం చారు. ప్రస్తుతానికి సొంత నిధులతో సోలార్‌ పవర్‌ ద్వారా విద్యుత్‌ సౌకర్యం కల్పిస్తామ న్నారు. బోరు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చా రు. అలాగే ఐసీడీఎస్‌ అధికారులతో మాట్లాడి గిరిజన పిల్లలకు అంగన్‌వాడీ కేంద్రం ద్వారా పౌష్ఠికాహారం అందజేతకు చర్యలు చేపడతామన్నారు. ఇక్కడి ఐదు గ్రామాల్లోని గిరిజనులు మక్కువ, సాలూరు మండలాల నుంచి వలస వచ్చి ఇక్కడ స్థిరపడినట్టు గుర్తించి, వారిని దగ్గరలోని పంచాయతీలో విలీనం చేసేందుకు గల అవ కాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశిం చారు. అసెంబ్లీ సమావేశాల్లో ఈ సమ స్యను ప్రస్తావించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తానన్నారు. కార్యక్రమంలో అధికారులు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Updated Date - Feb 10 , 2026 | 12:03 AM