కిచెన్ గార్డెన్లు ఏర్పాటుచేయాలి
ABN , Publish Date - Nov 15 , 2026 | 12:29 AM
ప్రతి గురుకుల పాఠశాల ఆవరణలోనూ కిచెన్ గార్డెన్ల పెంపకం చేపట్టాలని బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలల విజయనగరం, పార్వతీపురం జిల్లాల సమన్వయకర్త ఎస్.రూపవతి సూచించారు.
గురుకుల పాఠశాలల ఉమ్మడి జిల్లా సమన్వయకర్త రూపవతి
నెల్లిమర్ల, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): ప్రతి గురుకుల పాఠశాల ఆవరణలోనూ కిచెన్ గార్డెన్ల పెంపకం చేపట్టాలని బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలల విజయనగరం, పార్వతీపురం జిల్లాల సమన్వయకర్త ఎస్.రూపవతి సూచించారు. బాలల దినోత్సవం సందర్భంగా నెల్లిమర్లలోని అంబేడ్కర్ బాలికల గురుకుల కళాశాల, పాఠశాల ఆవరణలో న్యూట్రీ గార్డెన్ పెంపకం కార్యక్రమాన్ని ఆమె శనివారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశలల ఆవరణలో కొంత స్థలాన్ని కేటాయించి పోషక విలువలు కలిగిన ఆకుకూరలు, కూరగాయలను పండించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కె.ఉషారాణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
చీపురుపల్లి, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): గురుకుల పాఠశాలల్లో ఉపాధ్యా యులు, విద్యార్థులు కిచెన్ గార్డెన్లను ప్రోత్సహించాలని బీఆర్ అంబేడ్కర్ గురుకు ల పాఠశాలల విజయనగరం, పార్వతీపురం జిల్లాల సమన్వయకర్త రూపవతి సూచించారు. చీపురుపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో శనివారం ఆమె కిచెన్ గార్డెన్ ఫెస్టివల్‌ను ప్రారంభించారు. ప్రిన్సిపాల్ రాణిశ్రీ, ఉపాధ్యాయు లు, విద్యార్థులు పాల్గొన్నారు.