Share News

King Cobra కింగ్‌కోబ్రా కలకలం

ABN , Publish Date - Jun 17 , 2026 | 11:49 PM

King Cobra Scare గుమ్మలక్ష్మీపురం మండలంలోని గిరిశిఖర గ్రామం వత్తాడలో కింగ్‌కోబ్రా కలకలం రేపింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళన చెందారు. మంగళవారం అర్ధరాత్రి సమయంలో గ్రామంలోని ఓ ఇంటిలోకి చేరి బీరువాపైకి ఎక్కింది. బుధవారం ఉదయం కింగ్‌ కోబ్రా బుసలు కొట్టడం విని.. ఆ కుటుంబ సభ్యులు భయంతో బయటకు పరుగులు తీశారు.

King Cobra    కింగ్‌కోబ్రా కలకలం
కింగ్‌కోబ్రాను పట్టుకుంటున్న దృశ్యం

గుమ్మలక్ష్మీపురం, జూన్‌17(ఆంధ్రజ్యోతి): గుమ్మలక్ష్మీపురం మండలంలోని గిరిశిఖర గ్రామం వత్తాడలో కింగ్‌కోబ్రా కలకలం రేపింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళన చెందారు. మంగళవారం అర్ధరాత్రి సమయంలో గ్రామంలోని ఓ ఇంటిలోకి చేరి బీరువాపైకి ఎక్కింది. బుధవారం ఉదయం కింగ్‌ కోబ్రా బుసలు కొట్టడం విని.. ఆ కుటుంబ సభ్యులు భయంతో బయటకు పరుగులు తీశారు. వెంటనే అటవీశాఖాధికారులకు సమాచారం అందించారు. పాము బయటకు రాకుండా ఇంటికి తలుపులు వేశారు. మూడు గంటల అనంతరం విశాఖపట్నం నుంచి స్నేక్‌ క్యాచర్లు వచ్చి కింగ్‌కోబ్రాను చాకచాక్యంగా పట్టుకుని సమీపంలోని అడివిలోకి విడిచిపెట్టారు. దీంతో ఆ గ్రామ గిరిజనులు ఊపిరిపీల్చుకున్నారు. దీనిపై ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి గంగరాజు మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో కింగ్‌ కోబ్రాల సంఖ్య పెరుగుతుందన్నారు. ప్రజలు అప్రమంత్తంగా ఉండాలని సూచించారు.

Updated Date - Jun 17 , 2026 | 11:49 PM