Share News

Killed... and stuffed into a gunny sack. చంపేసి.. గోనెసంచిలో కుక్కేసి

ABN , Publish Date - Sep 16 , 2026 | 12:25 AM

Killed... and stuffed into a gunny sack. వారి మధ్య ఏం జరిగిందో ఏమో కాని.. మాటలు నమ్మి వచ్చిన మహిళను అతి దారుణంగా హత్య చేశాడు. ఆపై అత్యంత కర్కశంగా మృతదేహాన్ని గోనెసంచిలో కుక్కి బైక్‌పై తరలించాడు. దూరంగా పొదల్లో పడేసి ఏం తెలియనట్టు ఇంటికి చేరాడు. మహిళ భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని గుర్తించారు.

Killed... and stuffed into a gunny sack. చంపేసి.. గోనెసంచిలో కుక్కేసి
శీల రమ (ఫైల్‌)

చంపేసి.. గోనెసంచిలో కుక్కేసి

మహిళ దారుణ హత్య

సారిపల్లి సమీపంలో మృతదేహాన్ని పొదల్లో పడేసిన నిందితుడు

వివాహేతర సంబంధమే కారణం

వారి మధ్య ఏం జరిగిందో ఏమో కాని.. మాటలు నమ్మి వచ్చిన మహిళను అతి దారుణంగా హత్య చేశాడు. ఆపై అత్యంత కర్కశంగా మృతదేహాన్ని గోనెసంచిలో కుక్కి బైక్‌పై తరలించాడు. దూరంగా పొదల్లో పడేసి ఏం తెలియనట్టు ఇంటికి చేరాడు. మహిళ భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని గుర్తించారు. పూసపాటిరేగ మండలం నడిపల్లి గ్రామానికి చెందిన శీల రమ (35) విషాదాంతమిది. ఘటన సోమవారం జరగ్గా మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

నెల్లిమర్ల/ పూసపాటిరేగ, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి):

పూసపాటిరేగ మండలం నడిపల్లి గ్రామానికి చెందిన లంకలపల్లి బంగారుబాబు అవివాహితుడు. తల్లిదండ్రులతో కలిసి పాల వ్యాపారం చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన శీల రమ (35) ఆవు పాలు కోసం రోజూ బంగారుబాబు ఇంటివద్దకు వస్తుండేది. ఆ విధంగా ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధంగా మారింది. ఇటీవల కాలంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఈ క్రమంలో సోమవారం భర్త విధులకు వెళ్లిన తరువాత రమ బంగారుబాబు ఇంటికి వెళ్లింది. కొద్దిసేపటికి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కోపోద్రిక్తుడైన బంగారుబాబు ఆమెను కొట్టి మొహాన్ని తలగడతో అణిచేసి హత్య చేశాడు. ఆపై సాక్ష్యాలు దొరగకుండా చేయడం కోసం బియ్యం బస్తాలో మృతురాలు దేహాన్ని కుక్కి మోటారు సైకిల్‌పై తరలించాడు. నెల్లిమర్ల మండలం సారిపల్లి సమీప పొదల్లో పడేశాడు. అనంతరం విజయనగరం మీదుగా తిరిగి స్వగ్రామానికి వచ్చేశాడు. అదేరోజు రమ భర్త తన భార్య కనిపించటం లేదని స్థానిక పూసపాటిరేగ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అనుమానాస్పద వ్యక్తులపై ఆరా తీశారు. నిందితుడ్ని మంగళవారం పట్టుకుని విచారించడంతో విషయం బయటపడింది. పూసపాటిరేగ మండలంలో పోరాం శివారు కొబ్బరితోటలో నిందితుడిని పట్టుకొన్నట్లు పోలీసులు తెలిపారు. హత్య కేసును నమోదు చేసినట్లు నెల్లిమర్ల ఎస్‌ఐ అరుణ్‌కిరణ్‌ తెలిపారు. భోగాపురం రూరల్‌ సీఐ ఎన్‌.శ్రీనివాసరావు, విజయనగరం ఇన్‌చార్జి డీఎస్పీ సూరాడ రాఘవులు, మహిళా పోలీసు స్టేషన్‌ డీఎస్పీ పీవీ నరసింహారావు ఘటనపై విచారించారు.

చిన్నారుల ఆక్రందనలు

వివాహేతర సంబంధం ఒక ప్రాణాన్ని తీసింది. ఇద్దరు చిన్నారులకు తల్లిని దూరం చేసింది. దిక్కుతోచని స్థితిలో భర్తను ఒంటరిని చేసింది. తల్లి కనిపించకపోవడంతో అమ్మ కావాలంటూ చిన్నారుల ఆక్రందనలు చూసిన ప్రతి ఒక్కరు కన్నీరుపెట్టారు. రమ విశాఖలో ఒక ప్రయివేటు కళాశాలలో హౌస్‌ కీపింగ్‌ చేస్తోంది. సోమవారం వినాయక చవితి కావడంతో సెలవు కారణంగా ఇంటి వద్దే ఉంది. ఆపై నిందితుడు ఇంటికి వెళ్లింది.

Updated Date - Sep 16 , 2026 | 12:25 AM