Share News

గ్రామాలను ప్రశాంతంగా ఉంచుకోండి

ABN , Publish Date - Nov 25 , 2026 | 12:24 AM

గ్రామాలను ప్రశాంతంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చీపురుపల్లి డీఎస్పీ రాఘవులు అన్నారు.

గ్రామాలను ప్రశాంతంగా ఉంచుకోండి

  • చీపురుపల్లి డీఎస్పీ రాఘవులు

గరివిడి, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): గ్రామాలను ప్రశాంతంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చీపురుపల్లి డీఎస్పీ రాఘవులు అన్నారు. అర్థమూరు గ్రామంలో మంగళవారం రాత్రి ఆయన పల్లెనిద్ర నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన ఆ గ్రామస్థులతో మాట్లాడుతూ గ్రామాల్లో తగాదాలు పెట్టుకోవద్దని సూచిం చారు. వీటి వల్ల ఇరువర్గాలూ ఆర్థికంగా, మానసికంగా నష్టపోతారని తెలిపారు. ఎవరైనా చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే వారిపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి సీఐ శంకరరావు, గరివిడి ఎస్‌ఐ బి.లోకేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోండి

చీపురుపల్లి, నవంబ రు 24 (ఆంధ్రజ్యోతి): ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ఎస్‌ఐ పి.ఉమా వెంకటే శ్వరరావు కోరారు. మంగ ళవారం రాత్రి ఆయన తన సిబ్బందితో కలసి మండలంలోని జి.ముల గాం, అలజంగి, పేరిపి, పీకే పాలవలస గ్రామాల్లో ఆయన ఫ్లాగ్‌మార్చ్‌ నిర్వహించారు. అల్లర్లు, గొడవలు సృష్టిస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Nov 25 , 2026 | 12:24 AM