అంతర్జాతీయ చెస్ పోటీలకు కంచరాం విద్యార్థిని
ABN , Publish Date - Jun 01 , 2026 | 12:22 AM
మండల పరిధిలోని కంచరాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యా ర్థిని కలిశెట్టి పావని అంత ర్జాతీయ చెస్ పోటీలకు ఎంపికైంది.
రాజాం రూరల్, మే 31 (ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని కంచరాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యా ర్థిని కలిశెట్టి పావని అంత ర్జాతీయ చెస్ పోటీలకు ఎంపికైంది. జూన్ 1 నుంచి 8వ తేదీ వరకు అమరావతిలో నిర్వహించనున్న ఇంటర్నేష నల్ ఫైడ్ రేటింగ్ చెస్ టోర్నమెంట్-2026లో పావని పాల్గొననుంది. అండర్-15 విభాగంలో రాష్ట్ర క్రీడాకారిణిగా ఎంపికైన పావనిని పాఠ శాల హెచ్‌ఎం గౌరినాయుడు, వ్యాయామ ఉపాధ్యాయుడు దుర్గయ్య, సిబ్బంది ఆదివా రం అభినందించారు.