Share News

Justice ప్రశ్నిస్తేనే న్యాయం

ABN , Publish Date - Mar 13 , 2026 | 11:40 PM

Justice Comes Only When We Question వినియోగదారులు తమకు జరిగిన అన్యాయంపై గళమెత్తినప్పుడే ఆశించిన న్యాయం లభిస్తుందని జాయింట్‌ కలెక్టర్‌ యశ్వంత్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం పురస్కరించుకుని శుక్రవారం కలెక్టరేట్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.

Justice  ప్రశ్నిస్తేనే న్యాయం
మాట్లాడుతున్న జేసీ

పార్వతీపురం, మార్చి13(ఆంధ్రజ్యోతి): వినియోగదారులు తమకు జరిగిన అన్యాయంపై గళమెత్తినప్పుడే ఆశించిన న్యాయం లభిస్తుందని జాయింట్‌ కలెక్టర్‌ యశ్వంత్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం పురస్కరించుకుని శుక్రవారం కలెక్టరేట్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినియోగదారుల హక్కులపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. కొనుగోలు చేసే ప్రతి వస్తువుపై నిర్దేశించిన బరువు, కాలపరిమితి, ఎంఆర్‌పీని తెలుసుకోవాలన్నారు. తప్పనిసరిగా రశీదు తీసుకోవాలని సూచించారు. వినియోగదారులు తమ సమస్యలను ఆన్‌లైన్‌ ద్వారా లేదా అధికారుల దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి బి.అశోక్‌, డాక్టర్‌ జగన్మోహన్‌రావు, లీగల్‌ అడ్వయిజర్‌ టి.జోగారావు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 13 , 2026 | 11:40 PM