Just One Day! ఒక్కరోజే!
ABN , Publish Date - Apr 01 , 2026 | 12:19 AM
Just One Day! పంచాయతీల్లో సర్పంచ్‌ల పదవీ కాలం గురువారంతో ముగియనుంది. ఈనెల 3 నుంచి ప్రత్యేకాధికారులు బాధ్యతలు స్వీకరించున్నారు.
రేపటి నుంచి ప్రత్యేకాధికారుల పాలన
సాలూరు రూరల్, మార్చి 31(ఆంధ్రజ్యోతి): పంచాయతీల్లో సర్పంచ్‌ల పదవీ కాలం గురువారంతో ముగియనుంది. ఈనెల 3 నుంచి ప్రత్యేకాధికారులు బాధ్యతలు స్వీకరించున్నారు. 2020లో తొలుత పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే కరోనా వల్ల వాయిదా వేశారు. 2021 మార్చిలో జిల్లాలో 451 పంచాయతీలకు ఈ ఎన్నికలు జరిగాయి. కాగా ఈ నెల 2తో సర్పంచ్‌ల పదవీ కాలం ముగియనుండడంతో ఏప్రిల్ 3 నుంచి ప్రత్యేక అధికారుల పాలన మొదలుకానుంది. ప్రత్యేకాధికారుల నియమాకానికి సం బంధించి ఇప్పటికే ఎంపీడీవోలు ప్రతిపాదనలు చేశారు. అయితే వారి నియమాకంపై కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.