పెళ్లయిన 15 రోజులకే..
ABN , Publish Date - Jul 21 , 2026 | 12:15 AM
పెళ్లయిన 15 రోజులకే ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడి.. ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతూ ఆదివారం మృతిచెందింది.
మహిళ ఆత్మహత్య
గరివిడి, జూలై 20(ఆంధ్రజ్యోతి): పెళ్లయిన 15 రోజులకే ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడి.. ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతూ ఆదివారం మృతిచెందింది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గరివిడి మండలం కొండసం బం గ్రామానికి చెందిన పిల్లా సాయి అనే యువకుడికి చీపురుప ల్లి మండలం కరకాం గ్రామానికి చెందిన శ్రీలక్ష్మికి ఈనెల 2వ తేదీన ఇరు కుటుంబీకులు ఘనంగా వివాహం చేశారు. వివా హానికి ముందు శ్రీలక్ష్మి హైదరాబాద్‌లో ఒక ప్రైవేటు ఉద్యోగం చేసేది. ఆ సమ యంలో శ్రీలక్ష్మి మరో వ్యక్తితో చనువుగా ఉందని తెలుసుకున్న ఆమె భర్త పిల్లా సాయి.. నిత్యం గొడవలు పడేవాడు. తన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిసి పోతుందని భయపడిన శ్రీలక్ష్మి ఈనెల 17వ తేదీ మధ్యాహ్నం 11 గంటల సమ యంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగింది. దీనిని గమ నించిన స్థానికులు చీపురుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరు గైన వైద్యం కోసం విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృత్యువుతో పోరాడుతూ చివరగా ఆదివారం రాత్రి ఆమె మృతిచెందింది. గరివి డి తహసీల్దార్ బంగార్రాజు ఆధ్వర్యంలో మృతదేహానికి శవపంచనామా నిర్వహిం చారు. మృతురాలి తండ్రి కడగల బంగారునాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గరివిడి ఎస్‌ఐ బి.లోకేశ్వరరావు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.