విద్యుదాఘాతంతో జూనియర్ లైన్‌మన్ మృతి
ABN , Publish Date - May 05 , 2026 | 12:29 AM
శాసనపల్లి గ్రామంలో విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు స్తంభం ఎక్కిన జూనియర్ లైన్‌మ న్ బుగత అప్పలరాజు(28) విద్యుదాఘాతంతో మృతిచెందారు.
జామి, మే 4(ఆంధ్రజ్యోతి): శాసనపల్లి గ్రామంలో విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు స్తంభం ఎక్కిన జూనియర్ లైన్‌మ న్ బుగత అప్పలరాజు(28) విద్యుదాఘాతంతో మృతిచెందారు. ఈ ఘటనకు సంబంధించి ఏఈ జ్యోతిష్యరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని అన్నంరాజుపేట గ్రామానికి చెంది న అప్పలరాజు వన్నె సచివాలయం పరిధిలో జూనియర్ లైన్‌మన్ గా విధులు నిర్వహిస్తున్నారు. సోమవారం శాసనపల్లి గ్రామంలో విద్యుత్ లేదని స్థానికులు ఫిర్యాదు చేయడంతో అప్పలరాజు అక్కడకు చేరుకు న్నారు. స్థానికంగా ఉన్న ఎలక్ట్రీషియన్‌కు ట్రాన్స్ ఫార్మర్ ఆఫ్ చేయాలని చెప్పి ఆయన స్తంభం ఎక్కారు. ఎక్కిన తర్వాత విద్యుత్ తీగ తాకగానే ఒక్కసారిగా షాకుకు గురయ్యారు. వెంటనే విజయనగరం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు. మృతునికి భార్య, తల్లిదండ్రు లు ఉన్నారు. ఈ ఘటనపై జామి పోలీసులు కేసు నమోదు చేశారు.