Share News

మూడో రోజుకు జూనియర్‌ వైద్యుల నిరసన

ABN , Publish Date - Aug 20 , 2026 | 12:26 AM

తమ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రాసుపత్రి వద్ద జూనియర్‌ వైద్యులు చేపడుతున్న నిరసన బుధ వారం మూడో రోజుకు చేరుకుంది.

మూడో రోజుకు జూనియర్‌ వైద్యుల నిరసన

వియనగరం రింగురోడ్డు, ఆగస్టు(ఆంధ్రజ్యోతి): తమ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రాసుపత్రి వద్ద జూనియర్‌ వైద్యులు చేపడుతున్న నిరసన బుధ వారం మూడో రోజుకు చేరుకుంది. ఈసందర్భంగా జూనియర్‌ డాక్టర్ల అసోసియేషన్‌ ప్రతినిధులు డా.రేవం త్‌, జస్వంత్‌లు మాట్లాడుతూ.. ఆసుపత్రుల్లో అత్యవ సర సేవలకు గైర్హాజరైనట్టు తెలిపారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం 15శాతం స్టైపండ్‌ పెంపును తక్షణమే అమలు చేయాలని వైద్యులు పదవీ విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచే నిర్ణయాన్ని విరమించుకుని 62ఏళ్లకే పరిమితం చేయాలని కోరారు. మెడికల్‌ కళాశాలలో బోధనా పోస్టులకు సంబం ధించిన ఎంఎస్సీ, పీహెచ్‌డీ కోర్సులు వారీగా లాటరీ ఎంట్రీ ద్వారా నియమకా లు చేపట్టే విధానాన్ని రద్దుచేయాలని డిమాండ్‌ చేశారు. ఈ నిరసనలో పలువు రు జూడాలు పాల్గొన్నారు.

Updated Date - Aug 20 , 2026 | 12:26 AM