Share News

మెంటాడలో జూనియర్‌ కళాశాల

ABN , Publish Date - Jan 10 , 2026 | 11:57 PM

మెంటాడలో జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేస్తామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి హామీ ఇచ్చారు.

మెంటాడలో జూనియర్‌ కళాశాల

మెంటాడ, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): మెంటాడలో జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేస్తామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి హామీ ఇచ్చారు. మెంటాడ మండలంలో శని వారం ఆమె పర్యటించారు. స్థానిక హైస్కూల్‌లో రూ.1.60కోట్లతో నిర్మించిన అదనపు తరగతి భవనాలను ప్రారంభించారు. అనంతరం గురమ్మవలస, బుచ్చిరాజు పేటల్లో రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ హైస్కూల్‌కు మరుగుదొ డ్లు, తాగునీటి సౌకర్యం కల్పించేందుకు అంచ నాలు రూపొందించాలని అధికారులను ఆదేశిం చారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా జాతికి అందించే బాధ్యత గురువులపై ఉందని తెలిపా రు. ఏపని చేసినా తల్లికి చెప్పాలని విద్యార్థిను లకు సూచించారు. తల్లికి చెప్పలేనిది ఏదైనా తప్పు డు పనిగా భావించాలన్నారు. భూముల రీసర్వే పేరుతో వైసీపీ ప్రభుత్వం గందరగోళం సృష్టిం చిందని ఆరోపించారు. ఆ తప్పులను సరిచేస్తూ ప్రభుత్వం రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పుస్తకాలు అందజేస్తోందని మంత్రి సంధ్యారాణి తెలిపారు. ఈసందర్భంగా ఆమె ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పై ఆరా తీయగా... స్థానికులు అన్నీ అందుతు న్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. రూ.200 కోట్లతో సాలూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టినట్లు మంత్రి చెప్పా రు. గ్రామాలు అభివృద్ధి కావాలంటే వచ్చే ఎన్నికల్లో అన్ని పంచాయతీలలో సర్పంచ్‌లు, ఎంపీటీసీ స్థానాలు టీడీపీ వశం కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ముందుగా రైతులకు పాసు పుస్తకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ అరుణకుమారి, ఎంపీడీవో సుదర్శన్‌, టీడీపీ మండల అధ్యక్షు డు చలుమూరి వెంకట్రావు, గెద్ద అన్నవరం, ముసలి నాయుడు, అర్నిపల్లి సత్యం, తాడ్డి తిరుపతి, రెడ్డి ఎర్నాయుడు, రెడ్డి సత్యనారా యణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 10 , 2026 | 11:57 PM