సారా నియంత్రణకు ఉమ్మడి ప్రణాళిక
ABN , Publish Date - Oct 29 , 2026 | 11:31 PM
ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుల్లో సారా తయారీ, నిల్వ, విక్రయాలతో పాటు మద్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు ఉమ్మడి ప్రణాళిక అమలు చేసేందుకు ఇరు రాష్ట్రాల అధికారులు నిర్ణయించారు.
- ఏపీ, ఒడిశా అధికారుల నిర్ణయం
పార్వతీపురం, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుల్లో సారా తయారీ, నిల్వ, విక్రయాలతో పాటు మద్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు ఉమ్మడి ప్రణాళిక అమలు చేసేందుకు ఇరు రాష్ట్రాల అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు కొరాపుట్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో అంతర్రాష్ట్ర సమన్వయ సమావేశం నిర్వహించారు. కొరాపుట్ ఎస్పీ రోహిత్‌వర్మ పర్యవేక్షణలో జరిగిన ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల పోలీసు, ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు. అక్రమ మద్యం కేసుల్లో నిందితుల వివరాలు మార్పిడి, సంయుక్త దాడులు, తనిఖీలు, సరిహద్దుల్లో నిఘా పటిష్టం చేయడం, నోడల్ అధికారుల నియామకం వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో ప్రకటించిన డ్రైడేల్లో నిబంధనల మేరకు మద్యం దుకాణాలు మూసివేతకు సహకరించాలని, సరిహద్దుల మీదుగా అక్రమ మద్యం రవాణాను అడ్డుకునేందుకు సమన్వయంతో పనిచే యాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ సంతోష్ గోపాలకృష్ణ, పార్వతీపురం ఎక్సైజ్ ఎస్‌హెచ్‌వో నరసింహమూర్తి, టాస్క్‌ఫోర్స్ సీఐ శేఖర్‌బాబు, సాలూరు ఎక్సైజ్ ఎస్‌హెచ్‌వో దాసు, కొరాపుట్ జిల్లాకు చెందిన అధికారులు పాల్గొన్నారు.