టీడీపీలోకి చేరికలు
ABN , Publish Date - Oct 19 , 2026 | 12:15 AM
చీపురుపల్లి పట్టణం నుంచి వంద కుటుంబా లు, గరివిడి మండలం తాడిగూడ గ్రామం నుంచి 10 కుటుంబాలు వైసీపీ విడిచి టీడీపీలో చేరాయి.
గరివిడి, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): చీపురుపల్లి పట్టణం నుంచి వంద కుటుంబా లు, గరివిడి మండలం తాడిగూడ గ్రామం నుంచి 10 కుటుంబాలు వైసీపీ విడిచి టీడీపీలో చేరాయి. వీరంతా ఆదివారం చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కామినాయుడు, నాగరాజు, వలిరెడ్డి శ్రీను, గరివిడి మండలం తాటిగూడ గ్రామ నాయకుడు శనపతి సన్యాసి, మండల నాయకులు సారిపాక సురేష్కుమార్, పైల బలరాం తదితరులు పాల్గొన్నారు.