Tourist Destination చేయి చేయి కలిపి.. పర్యాటకంగా తీర్చిదిద్ది..
ABN , Publish Date - Jan 17 , 2026 | 12:18 AM
Joining Hands to Develop as a Tourist Destination మారుమూల గిరిజన గ్రామాన్ని పర్యాటక ప్రాంతంగా మారుస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు కుశ గిరిజనులు. చేయి చేయి కలిపి.. తమ గ్రామాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నారు. పర్యాటకులను ఆకట్టుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామ సమీపంలో ఉన్న జలపాతాన్ని సందర్శించేందుకు వచ్చే వారి కోసం శ్రమదానంతో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నారు.
జలపాతం సందర్శకులను ఆకట్టుకునే విధంగా ఏర్పాట్లు
ఆదర్శంగా కుశ గ్రామ గిరిజనులు
గుమ్మలక్ష్మీపురం, జనవరి16(ఆంధ్రజ్యోతి): మారుమూల గిరిజన గ్రామాన్ని పర్యాటక ప్రాంతంగా మారుస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు కుశ గిరిజనులు. చేయి చేయి కలిపి.. తమ గ్రామాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నారు. పర్యాటకులను ఆకట్టుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామ సమీపంలో ఉన్న జలపాతాన్ని సందర్శించేందుకు వచ్చే వారి కోసం శ్రమదానంతో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఇటీవల ఆ గ్రామ గిరిజనుల ఆహ్వానం మేరకు కుశ గ్రామాన్ని, అక్కడున్న జలపాతాన్ని కలెక్టర్ కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి సందర్శించారు. ఈ ప్రాంతాన్ని గ్రామస్థుల సహకారంతో పర్యాటక ప్రాంతంగా మరింత అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. మరోవైపు కుశ గ్రామ గిరిజనులు జలపాతాన్ని వెళ్లడానికి శ్రమదానంతో చిన్నపాటి రహదారిని నిర్మించారు. అడవిలోనే వెదురు కలపను తీసుకొచ్చి అర్చీలను ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలో స్టేజ్ తో పాటు జలపాతానికి వెళ్లే దారిలో కంచె నిర్మాణం కూడా చేపట్టారు. ఇప్పటికే పలువురు పర్యాటకులు కుశ గ్రామంలో ప్రత్యేకంగా వెదురుతో గిరిజనులు ఏర్పాటు చేసిన అర్చీలు, స్టేజ్, వంతెలను చూసి ఆశ్చర్యపోతున్నారు. ‘కుశను ఉత్తమ గ్రామంగా, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసుకోవాలని నిర్ణయించాం. ప్రభుత్వం అన్ని విధాలా సహకారాలు అందించాలి. అని సర్పంచ్ సీతారాం తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలోని జలపాతాలను, వాటి సమీపంలో గ్రామాలను పర్యాటక కేంద్రా లుగా అభివృద్ధి చేస్తున్నాం. అని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో యశ్వంత్‌కుమార్‌రెడ్డి చెప్పారు.