Share News

ఉద్యోగ భద్రత కల్పించాలి

ABN , Publish Date - May 17 , 2026 | 12:11 AM

మునిసిపల్‌ కాంట్రాక్టు కార్మికులను హైకోర్టు తీర్పు ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించి పర్మినెంట్‌ చేయాలని సీఐటీయూ నాయకుడు జీవీ రమణ డిమాండ్‌ చేశారు

 ఉద్యోగ భద్రత కల్పించాలి
నిరసన తెలుపుతున్న మునిసిపల్‌ కార్మికులు

పార్వతీపురంటౌన్‌, మే 16 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్‌ కాంట్రాక్టు కార్మికులను హైకోర్టు తీర్పు ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించి పర్మినెంట్‌ చేయాలని సీఐటీయూ నాయకుడు జీవీ రమణ డిమాండ్‌ చేశారు. శనివారం స్థానిక మునిసిపల్‌ కార్యాలయం వద్ద సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మునిసిపల్‌ కార్మికులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఇచ్చి హైకోర్టు తీర్పును అమలు చేయకుండా గత, ప్రస్తుత ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 60 ఏళ్లపాటు మునిసిపల్‌ కార్మికులుగా సేవచేసిన వారికి పదవీ విరమణ తరువాత ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందకపోవడం బాధకరమన్నారు. ప్రభుత్వాలు కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. కార్మికుల సంఖ్యను పెంచి పనిభారాన్ని తగ్గించాలన్నారు.

Updated Date - May 17 , 2026 | 12:11 AM