స్టీల్‌ప్లాంట్‌తో ఉద్యోగ అవకాశాలు
ABN , Publish Date - Mar 22 , 2026 | 11:56 PM
అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఈనెల 23న ఏర్పాటు చేయనున్న స్టీల్‌ప్లాంట్‌తో ఉద్యోగ అవకాశాలు లభిస్తా యని జిల్లాలోని టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు తెలిపారు.
నేడు నక్కపల్లిలో శంకుస్థాపన
ప్రజాప్రతినిధులు, నాయకుల ప్రచారం
అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఈనెల 23న ఏర్పాటు చేయనున్న స్టీల్‌ప్లాంట్‌తో ఉద్యోగ అవకాశాలు లభిస్తా యని జిల్లాలోని టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు.
యువత భవిష్యత్తుకు పెద్దపీట..
విజయనగరం రూరల్, మార్చి 22(ఆంధ్రజ్యోతి): యువత భవిష్యత్తుకు సీఎం చంద్రబాబు పెద్దపీట వేస్తున్నారని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఈనెల 23న స్టీల్‌ప్లాంట్ శంకుస్థాపన చేయనున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆమె 39వ డివిజన్ పరిధిలోని కుసుమ గజపతినగర్‌లో స్థానిక పార్టీ నాయకులు కొర్నాన రాజ్యలక్ష్మీ, చిట్టిబాబు, రాయపాటి సంతోష్‌తో కలిసి ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చే శారు.
ఆంధ్రాకు మరో మైలురాయి..
రాజాం, మార్చి 22(ఆంధ్రజ్యోతి): అనకాపల్లి జిల్లా లో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు ఆంధ్రప్రదేశ్‌కు ఒక మైలు రాయిగా నిలవబోతుందని ఎమ్మెల్యే కోండ్రు మురళీ మోహన్ అన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం డోల పేటలో ప్రచారం నిర్వహించారు. ఈ పరిశ్రమ ద్వారా నిరుద్యోగ యువతకు లక్ష ఉద్యోగాలు లభించనున్నాయ ని తెలిపారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు నంది సూర్య ప్రకాష్‌రావు, గురవాన నారాయణరావు పాల్గొన్నారు.
మారనున్న ఉత్తరాంధ్ర ముఖచిత్రం..
ఎస్.కోట రూరల్, మార్చి 22(ఆంధ్రజ్యోతి): అనకా పల్లి జిల్లాలో ఏర్పాటుకానున్న స్టీల్‌ప్లాంట్ ఉత్తరాంధ్ర ముఖచిత్రం మార్చబోతోందని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు. ఈ మేరకు ఆమె ఆదివారం ఎస్.కోట శ్రీనివాస కాలనీలో టీడీపీ మండల అధ్యక్షుడు డోకుల అచ్చెంనాయుడు ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాయవరపు చంద్రశేఖర్, పార్టీ మండల కార్యదర్శి జగదీష్, నాయకు డు జీఎస్ నాయుడు, దాసరి కార్పొరేషన్ డైరెక్టర్లు రమణాజీ, బంగారునాయుడు, నాయకులు కిరణ్, చెల్లయ్య, వాసు, రామసత్యం తదితరులు వున్నారు.