Share News

జయహో అమరావతి

ABN , Publish Date - Apr 02 , 2026 | 11:38 PM

రాష్ట్ర రాజధాని అమరావతి బిల్లు పార్లమెంట్‌ ఉభయ సభల్లో ఆమోదం పొందడంతో గురువారం జిల్లా వ్యాప్తంగా ప్రజలు సంబరాలు జరుపుకొన్నారు.

జయహో అమరావతి
కలెక్టరేట్‌లో కేక్‌ కట్‌ చేస్తున్న కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి

-జిల్లా వ్యాప్తంగా సంబరాలు

- దీపాలు వెలిగించిన మహిళలు

- కేక్‌ కట్‌ చేసిన కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి

పార్వతీపురం, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజధాని అమరావతి బిల్లు పార్లమెంట్‌ ఉభయ సభల్లో ఆమోదం పొందడంతో గురువారం జిల్లా వ్యాప్తంగా ప్రజలు సంబరాలు జరుపుకొన్నారు. సీతంపేట, సాలూరు, కురుపాం, పాచిపెంట, గుమ్మలక్ష్మీపురం, పార్వతీపురం, బలిజిపేట తదితర మండలాల్లో మహిళలు తమ ఇళ్ల ముందు ముగ్గులు వేసి దీపాలు వెలిగించారు. కొవ్వొత్తులను వెలిగించి ర్యాలీలు నిర్వహించారు. పలుచోట్ల కేక్‌లు కట్‌ చేయడంతో పాటు బాణసంచా కాల్చి నృత్యాలు చేశారు. జయహో అమరావతి అని నినాదాలు చేశారు. కలెక్టర్‌ కార్యాలయాన్ని విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి కేక్‌ కటింగ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించడం ఎంతో శుభ పరిణామమన్నారు. కార్యక్రమంలో జేసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డి, డీఆర్‌వో హేమలతతో పాటు ఇతర అధికారులు, మహిళలు పాల్గొన్నారు. అదే విధంగా పార్వతీపురంలో ఎమ్మెల్యే విజయచంద్ర ఆధ్వర్యంలో పాత బస్టాండ్‌ వద్ద సంబరాలను నిర్వహించారు.

Updated Date - Apr 02 , 2026 | 11:38 PM