Share News

Janjhavathi Water జంఝావతి నీరు విడుదల

ABN , Publish Date - Feb 23 , 2026 | 12:02 AM

Janjhavathi Water Released జంఝావతి ప్రాజెక్టు పరిధిలోని ప్రధాన కాలువల నుంచి ఆదివారం నీటిని విడుదల చేశారు. కొమరాడ, పార్వతీపురం, గరుగుబిల్లి, సీతానగరం మండలాల్లో చెరువులను నింపుకొనేందుకు, తాగునీటి అవసరాలు తీర్చేందుకు నీరు విడుదల చేసినట్లు జేఈ పత్తిక పవన్‌కుమార్‌ తెలిపారు.

Janjhavathi Water  జంఝావతి నీరు విడుదల
తులసిరామినాయుడువలస సమీపంలో జంఝావతి కాలువ నుంచి సరఫరా అవుతున్న నీరు

గరుగుబిల్లి, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): జంఝావతి ప్రాజెక్టు పరిధిలోని ప్రధాన కాలువల నుంచి ఆదివారం నీటిని విడుదల చేశారు. కొమరాడ, పార్వతీపురం, గరుగుబిల్లి, సీతానగరం మండలాల్లో చెరువులను నింపుకొనేందుకు, తాగునీటి అవసరాలు తీర్చేందుకు నీరు విడుదల చేసినట్లు జేఈ పత్తిక పవన్‌కుమార్‌ తెలిపారు. జంఝావతి ప్రాజెక్టు నుంచి సుమారు 50 క్యూసెక్కుల మేర సరఫరా చేస్తున్నామని, సాగునీటి సామర్థ్యాన్ని అనుసరించి ఆరుతడి పంటలకు ప్రాధాన్యం ఇస్తున్నామని వెల్లడించారు. శివారు ప్రాంతాలకు పూర్తిస్థాయిలో నీరు సరఫరా అయ్యేలా చర్యలు చేపడుతున్నామన్నారు. నీరు వృఽథా కాకుండా ఉండేందుకు ఓటీలను మూసివేశామని తెలిపారు. ప్రస్తుతం ప్రధాన కాలువల నుంచి నీరు సరఫరా కావడంతో రైతులు ఆరుతడి పంటలకు సన్నద్ధమవుతున్నారు.

Updated Date - Feb 23 , 2026 | 12:02 AM