Share News

జగన్‌ ప్రజాస్వామ్యంపై మాట్లాడడం అతిపెద్ద జోక్‌

ABN , Publish Date - Jul 02 , 2026 | 12:29 AM

ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని అరాచకాల కు అడ్డాగా మార్చిన వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి.. ఈ రోజు ప్రజాస్వామ్యంపై మా ట్లాడటం ఈ శతాబ్దపు అతి పెద్ద జోక్‌ అని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఎద్దేవా చేశారు.

 జగన్‌ ప్రజాస్వామ్యంపై మాట్లాడడం అతిపెద్ద జోక్‌

  • ఎంపీ కలిశెట్టి

విజయనగరం, జూలై 1(ఆంధ్రజ్యో తి): ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని అరాచకాల కు అడ్డాగా మార్చిన వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి.. ఈ రోజు ప్రజాస్వామ్యంపై మా ట్లాడటం ఈ శతాబ్దపు అతి పెద్ద జోక్‌ అని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఎద్దేవా చేశారు. బుధవారం విజయనగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ నగర అధ్యక్షుడు గంటా రవితో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. నాడు అసెంబ్లీ సాక్షిగా రాజధానిగా అమరావతికి 33 వేల ఎకరాలు కావాలని మద్దతు తెలిపి, అధికారంలోకి రాగానే 3 రాజధానుల ముసుగులో అమరావతిని శ్మశానంగా మార్చింది జగన్‌ కాదా..? అని ప్రశ్నిం చారు. 500 రోజులకు పైగా న్యాయం కోసం పోరాడిన అమరావతి రైతులను, మహిళలను బూటు కాళ్లతో తొక్కించి, లాఠీలతో కొట్టించి, అక్రమ కేసులు బనాయించిన జంగిల్‌ రాజ్‌ చరిత్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు. నాడు కోడికత్తి డ్రామా ఆడి, ఒక అమాయక దళిత యువకుడిని ఐదేళ్ల పాటు జైల్లో మగ్గేలా చేసింది ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నా రు. ‘సొంత బాబాయి వైఎస్‌ వివేకానంద రెడ్డిని గొడ్డలి తో నరికి, గుండెపోటు అని కథలు అల్లిన చరిత్ర మీది కాదా..’ అని నిలదీశారు. ‘తండ్రి హత్యకు న్యాయం కా వాలని సునీత రోడ్డెక్కితే ఆమెపై సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ చేయించి, కేసులు పెట్టి వేధించింది మీ ప్రభు త్వం కాదా’ అని ప్రశ్నించారు. ‘గత ఐదేళ్లలో మీ అనుచ రులు అనేక తప్పులు చేసి చట్టానికి దొరికిపోతుంటే దాన్ని ‘అరాచకం’ అని కలరింగ్‌ ఇచ్చారని, తప్పు చేసిన వారు ఎంతటి వాడైనా చట్టం ముందు మోకరిల్లాల్సిం దేనని, ఇదే చంద్రబాబు రూల్‌ ఆఫ్‌ లా’ అని అన్నారు.

Updated Date - Jul 02 , 2026 | 12:29 AM