Share News

‘ధ్వంసరచనకు జగన్‌ ప్రణాళికలు’

ABN , Publish Date - Sep 30 , 2026 | 12:03 AM

మాజీ సీఎం జగన్‌ బెంగళూరులో ఉంటూ రాష్ట్రంలో ధ్వంస రచనకు ప్రణాళికలు రూపొందిస్తున్నారని జోన్‌-1 టీడీపీ ఇన్‌చార్జి, తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆరోపించారు.

‘ధ్వంసరచనకు జగన్‌ ప్రణాళికలు’
వీణను బహూకరిస్తున్న ఎమ్మెల్యే బేబీనాయన

బొబ్బిలి, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం జగన్‌ బెంగళూరులో ఉంటూ రాష్ట్రంలో ధ్వంస రచనకు ప్రణాళికలు రూపొందిస్తున్నారని జోన్‌-1 టీడీపీ ఇన్‌చార్జి, తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆరోపించారు. పార్వతీపురం ఎమ్మెల్యే విజయచంద్ర తదితరులతో కలిసి ఆయన మంగళవారం బొబ్బిలి కోటలోని మ్యూజియంను సందర్శిం చారు. వారికి ఎమ్మెల్యే బేబీనాయన స్వాగతం పలికారు. మ్యూజియం వివరాలను, బొబ్బిలి చరిత్రను, రాజవంశీయుల కోసం వివరించారు. అనంతరం దర్బార్‌ మహల్‌లో రాధాకృష్ణ విలేకరులతో మాట్లాడారు. వైసీపీలో ఉంటే ఇక తమకు భవిష్యత్‌ ఉండదన్న అభద్రతా భావంతో ఆ పార్టీ శ్రేణులంతా సతమతమవుతున్నారన్నారు. అందుకే పెద్దఎత్తున టీడీపీలో చేరేందుకు క్యూ కడుతున్నారు. డీఎస్పీపై అనవసర రాద్ధాంతాన్ని సృష్టిస్తూ ఉద్యోగాలు సాధించుకున్నవారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్న తీరును అందరూ అసహ్యించుకుంటు న్నారన్నారు. ఈ సందర్భంగా ఆయన బొబ్బిలి కోటలో ఏర్పాటు చేసిన మ్యూజియం అద్భుతంగా ఉందన్నారు. బొబ్బిలి చరిత్రను అందరూ సునాయాసంగా తెలుసుకునేందుకు ఆనాటి బొబ్బిలి యుద్ధంలో వాడిన ఆయుధాలు, రాజులు వినియోగించిన సింహాసనాలు, వాహనాలు, ఇతర అనేక ఆసక్తికరమైన సామగ్రిని సందర్శకుల కోసం ఏర్పాటుచేయడం గొప్పవిషయమన్నారు. వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాలలో సహజసిద్ధమైన వన్యప్రాణుల ఫొటోలను స్వయంగా తీసి ప్రత్యేకంగా ఫొటోగ్యాలరీని ఏర్పాటు చేసిన బేబీనాయనను అభినందించారు. కార్యక్రమంలో స్థానిక సంస్ధల ఎన్నికల ఇన్‌చార్జి దాడి రత్నాకర్‌, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వైరిచర్ల వీరేష్‌ చంద్రదేవ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాధాకృష్ణను ఎమ్మెల్యే సత్కరించి బొబ్బిలి వీణను బహూకరించారు.

Updated Date - Sep 30 , 2026 | 12:03 AM