జగన్‌ది తుపాకుల సంస్కృతి: మంత్రి
ABN , Publish Date - Apr 14 , 2026 | 11:50 PM
మాజీ సీఎం వైఎస్ జగన్మోహ న్ రెడ్డికి గన్ సంస్కృతి బాగా వంట బట్టి నట్టుందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి విమర్శించారు.
మెంటాడ, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం వైఎస్ జగన్మోహ న్ రెడ్డికి గన్ సంస్కృతి బాగా వంట బట్టి నట్టుందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి విమర్శించారు. అందుకే రాజధానికి బి ప్లాన్ అంటూ మావిగన్‌ను తెర పైకి తెచ్చారని దుయ్య బట్టారు. మండలంలోని స్వయం సహాయక సంఘాల వీఓఏలకు ప్రభుత్వం మంజూరు చేసిన స్మార్ట్ ఫోన్లను మంగళవారం ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గన్నులు, గొడ్డళ్లలంటూ జగన్ రక్తపాతాన్ని ఎంపిక చేసుకున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికత, మంత్రి లోకేష్ పట్టుదలతో రాష్ట్రానికి ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థలు పోటెత్తుతున్నాయని అన్నారు. భవిష్యత్తులో ప్రపంచం చూపు ఆంధ్రప్రదేశ్ వైపు ఉంటుందని అన్నారు. రాష్ట్రాన్ని సమ్మిళిత ప్రగతి దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకువెళుతోందన్నారు. మండలంలో 30 మంది వీఓఏలు పని చేస్తున్నారని... స్మార్ట్‌ఫోన్ల ద్వారా సభ్యులకు వేగంగా, పారదర్శకంగా సేవలు అందించవచ్చునని చెప్పారు. అంతకుముందు మంత్రి సంధ్యారాణి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అభివృద్ధి పనులపై ఆరా తీశారు. ఉద్యోగులు బాధ్యతయుతంగా పనిచేస్తూ ప్రభుత్వానికి ప్రోత్సాహాన్ని అందించాలని సూచించారు. ముందుగా అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విజయభాస్కర్, ఎంపీడీఓ సుదర్శన్, ఏపీఎం అన్నపూర్ణ, ఏవో గోకులకృష్ణ, మండల టీడీపీ అధ్యక్షుడు చలమూరి వెంకటరావు, గెద్ద అన్నవరం తదితరులు పాల్గొన్నారు.