Share News

వైసీపీకి జగన్నాథరెడ్డి రాజీనామా

ABN , Publish Date - Oct 07 , 2026 | 12:16 AM

నగర పరిధిలోని వైఎస్సార్‌ నగర్‌కు చెందిన వైసీపీ నాయకుడు తోణంగి జగన్నాథరెడ్డి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి, టీడీపీలో చేరారు.

  వైసీపీకి జగన్నాథరెడ్డి రాజీనామా

విజయనగరం రూరల్‌, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): నగర పరిధిలోని వైఎస్సార్‌ నగర్‌కు చెందిన వైసీపీ నాయకుడు తోణంగి జగన్నాథరెడ్డి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి, టీడీపీలో చేరారు. ఆయనతో పాటు ఆయన అనుచరులు, 50 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. మంగళవారం రాత్రి స్థానిక క్యాంపు కార్యాలయంలో విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు వీరికి పసుపు కండువాలు వేసి, పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భం గా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైఎస్సార్‌ నగర్‌లో దీర్ఘకాలికంగా సమస్యలు ఉన్నాయ ని, ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 50వ డివిజన్‌ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

టీడీపీలోకి 50 కుటుంబాలు

సంతకవిటి, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): తాలాడ మాజీ సర్పంచ్‌ మల్లిక గోపాల కృష్ణతో పాటు సుమారు 50 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. మంగళ వారం వారంతా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొళ్ల అప్పలనాయుడు ఆధ్వ ర్యంలో పార్టీలో చేరారు. టీడీపీ మండల అధ్యక్షుడు గట్టి భాను, రాజాం వాణి జ్య విభాగం అధ్యక్షుడు వల్లూరు గణేష్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ చెలికాని మహేష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 07 , 2026 | 12:16 AM