Jana Sena జనసేనలోకి జగదీష్
ABN , Publish Date - Oct 16 , 2026 | 11:52 PM
Jagadeesh to Join Jana Sena టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ శుక్రవారం జనసేన పార్టీలో చేరారు. పట్టణంలో నిర్వహించిన ప్రత్యేక కార్య క్రమంలో అరకు పార్లమెంట్ పరిశీలకుడు ఎమ్మెల్సీ నాగబాబు ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జగదీష్ అనుచరులు చుక్క జగదీష్, డి.మోహన్, డి.భాను, ఎం.కార్తీక్, జి.రామ్మూర్తినాయుడు, అక్కేన శ్రీనివాసరావు, పలువురు మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు టీడీపీ నుంచి జనసేన పార్టీలో చేరారు.
సముచిత స్థానం కల్పిస్తాం: ఎమ్మెల్సీ నాగబాబు
పార్వతీపురం, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ శుక్రవారం జనసేన పార్టీలో చేరారు. పట్టణంలో నిర్వహించిన ప్రత్యేక కార్య క్రమంలో అరకు పార్లమెంట్ పరిశీలకుడు ఎమ్మెల్సీ నాగబాబు ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జగదీష్ అనుచరులు చుక్క జగదీష్, డి.మోహన్, డి.భాను, ఎం.కార్తీక్, జి.రామ్మూర్తినాయుడు, అక్కేన శ్రీనివాసరావు, పలువురు మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు టీడీపీ నుంచి జనసేన పార్టీలో చేరారు. బీజేపీ సీనియర్ నాయకుడు ఎస్.ఉమామహేశ్వరరావు కూడా ఆ పార్టీలో చేరారు. అనంతరం నాగబాబు విలేఖర్లతో మాట్లాడుతూ.. ‘జనసేన సైనికులు బుల్లెట్లు లాంటి వారు. అయితే సరైన తుపాకీ కలిగిన షూటర్ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో జగదీష్లాంటి వ్యక్తి జనసేనలో చేరడం ఎంతో ఆనందంగా ఉంది. ఆయనతో పాటు అనుచరులు జనసేనలోకి రావడం వల్ల పార్టీ మరింత బలోపేతం అవుతుంది. జగదీష్కు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తాం.’ అని తెలిపారు. ‘సాలూరులో వైసీపీకి చెందిన కొంతమంది చైర్పర్సన్ టికెట్ ఆశిస్తూ జనసేనలో చేరేందుకు యత్నిస్తున్నట్లు తెలిసింది.. మీతో ఎవరైనా మాట్లాడారా?’ అని విలేఖర్లు అడగ్గా.. పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు సీట్లు కేటాయింపు ఉంటుందని నాగబాబు స్పష్టం చేశారు. మంచి నాయకులకు జనసేన స్వాగతం పలుకుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్వతీపురం నియోజకవర్గం ఇన్చార్జి మోహన్రావు , అరకు పార్లమెంట్ నాయకుడు జయరాజు తదితరులు పాల్గొన్నారు.