Share News

పనస ధర పతనం

ABN , Publish Date - Mar 15 , 2026 | 11:08 PM

గిరిజన రైతులకు ప్రతి ఏటా ఆదాయం చేకూర్చే పంటల్లో ఒక్కటైన చెట్టు పనసకాయ ధర పూర్తిగా పతనమైంది.

పనస ధర పతనం
:సీతంపేట వారపుసంతలో పోగులుగా పోసిన చెట్టుపనసకాయలు

- కేజీ పది రూపాయలే

- సీజన్‌ ముగుస్తుండడమే కారణం

సీతంపేట రూరల్‌, మార్చి 15(ఆంధ్రజ్యోతి): గిరిజన రైతులకు ప్రతి ఏటా ఆదాయం చేకూర్చే పంటల్లో ఒక్కటైన చెట్టు పనసకాయ ధర పూర్తిగా పతనమైంది. కేజీ పనసకాయ పది రూపాయలే పలుకుతోంది. సీజన్‌ ముగుస్తుండడంతో వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో పండే చెట్టుపనసకు కోల్‌కతా, భువనేశ్వర్‌, పూరీ, కటక్‌, ముంబాయ్‌ వంటి ప్రాంతాల్లో విపరీతమైన డిమాండ్‌ ఉంది. రెండు నెలల కిందట చెటు ్టపనసకాయలు కేజీ రూ.20 నుంచి రూ.25వరకు అమ్ముడుపోయాయి. అయితే మార్చి నెలతో వీటి సీజన్‌ ముగుస్తుండడం, కాయ సైజు కూడా తగ్గిపోవడంతో వాటి ధర ఒక్కసారిగా పడిపోయింది. ప్రస్తుతం కేజీ రూ.10గా ఉంది. ఇదే అదునుగా గిరిజన రైతుల నుంచి వ్యాపారులు పెద్దఎత్తున పనసకాయలను కొనుగోలు చేసి వాహనాల్లో మైదాన ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Updated Date - Mar 15 , 2026 | 11:08 PM