Shiva Worship శివపూజకు వేళాయే..
ABN , Publish Date - Feb 15 , 2026 | 12:26 AM
It’s Time for Shiva Worship మహా శివరాత్రి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకునేందుకు జిల్లావాసులు సన్నద్ధమయ్యారు. ఆదివారం ప్రత్యేక పూజలు, ఉపవాస దీక్ష, జాగరణకు చేసేందుకు సమాయత్తమయ్యారు. వేకువ జామునే శైవక్షేత్రాలకు వెళ్లి భక్తిశ్రద్ధలతో ముక్కంటిని కొలిచేందుకు సర్వం సిద్ధం చేశారు.
పార్వతీపురం, ఫిబ్రవరి14(ఆంధ్రజ్యోతి): మహా శివరాత్రి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకునేందుకు జిల్లావాసులు సన్నద్ధమయ్యారు. ఆదివారం ప్రత్యేక పూజలు, ఉపవాస దీక్ష, జాగరణకు చేసేందుకు సమాయత్తమయ్యారు. వేకువ జామునే శైవక్షేత్రాలకు వెళ్లి భక్తిశ్రద్ధలతో ముక్కంటిని కొలిచేందుకు సర్వం సిద్ధం చేశారు. మరోవైపు జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రాలు, గుహాలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లు, షామియానాలు, బారికేడ్లు తదితర వాటిని సిద్ధం చేశారు. పలుచోట్ల జాతరలు కూడా నిర్వహించనున్న నేపథ్యంలో ఎటు వంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
శివరాత్రికి ప్రత్యేక బస్సులు
సాలూరు రూరల్, ఫిబ్రవరి14(ఆంధ్రజ్యోతి): శివరాత్రి సందర్భంగా జాతర, ఆలయాల సంద ర్శన కోసం జిల్లా నుంచి 65 బస్సులను ప్రత్యేకంగా నడుపుతున్నామని ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణాధికారి (డీపీటీవో) వెంకటేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సాలూరు నుంచి పారమ్మకొండకు 30 బస్సులను నడుపుతున్నామన్నారు. పార్వతీపురం నుంచి గొంపనకు 10 బస్సులు, పాలకొండ నుంచి విజయనగరం జిల్లా రామతీర్థనానికి 25 బస్సులను నడుపుతున్నట్టు వెల్లడించారు. ఈ బస్సుల్లో మహిళలకు స్త్రీశక్తి పథకం వర్తింపజేస్తున్నామన్నారు. ఆధార్ కార్డుతో మహిళలు ఉచిత ప్రయాణం చేయొచ్చని పేర్కొన్నారు. రద్దీ ప్రాంతాల్లో ఆర్టీసీ భద్రత సిబ్బందిని ఉంచి తోపులాట, దొంగతనాల నివారణకు కృషి చేస్తామన్నారు.